కొన్ని కొన్ని సార్లు సినిమా ఇండస్ట్రీలో మనం ఊహించనివి జరుగుతూ ఉంటాయి. అలా జరిగినప్పుడు భలే విచిత్రంగా అనిపిస్తూ ఉంటుంది . కొంతమంది స్టార్ హీరో ఫ్యాన్స్ కి మాత్రం భలే ఛాన్స్ మిస్ అయిపోయాడు రా అనిపిస్తూ ఉంటుంది . ప్రజెంట్ అలాంటి ఒక న్యూస్ సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది. సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు స్టార్ హీరోలకి మించిన రేంజ్ లో హీరోయిన్స్ క్రేజీ పాపులారిటీ దక్కించుకుంటున్నారు అని చెప్పడంలో సందేహమే లేదు.  మరీ ముఖ్యంగా రష్మిక మందన్నా అయితే స్టార్ హీరోలనే మించిపోయే స్థాయిలోనే తన పేరుకి పాపులారిటీ దక్కించుకుంది .


అంతేకాదు రష్మిక మందన్నా పేరు ఇప్పుడు ఎక్కడ చూసినా వినిపిస్తుంది.  ఏ స్టార్ హీరో అయినా డైరెక్టర్ అయినా మా సినిమాలో రష్మిక ఉండాలి మా సినిమా ఉండాలి అంటూ తెగ కోరుకుంటున్నారు. ఇలాంటి క్రమంలోనే  రష్మిక మందన్నా అదే విధంగా ప్రభాస్ కాంబోలో రావాల్సిన మూడు సినిమాలు ఎలా మిస్ అయ్యాయి అనే విషయాన్ని చర్చించుకుంటున్నారు సినీ లవర్స్ . రష్మిక - ప్రభాస్ కాంబోలో ఒక్క సినిమా అయిన రాకపోతుందా..? అంటూ ఫ్యాన్స్ ఎంతో ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు . అయితే ఈ కాంబోలో మాత్రం ఇంకా  మూవీ సెట్ అవ్వలేదు.



కానీ గతంలో సెట్ అవ్వాల్సిన ప్రాజెక్ట్ చాలానే వచ్చినట్టే వచ్చి ఆగిపోయాయి.  హైలెట్ ఏంటంటే ఆ ప్రాజెక్ట్స్ నీ స్వయాన ప్రభాస్ నే  రిజెక్ట్ చేశారట. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో "ప్రభాస్" ప్రజెంట్ "స్పిరిట్" అనే సినిమాలో నటిస్తున్నాడు.  అయితే అంతకు ముందు ఆయన దర్శకత్వంలో "అనిమల్" అనే సినిమాలోనే ప్రభాస్ ని హీరోగా అనుకున్నారట సందీప్ రెడ్డి వంగ . కానీ ప్రభాస్ కి ఈ క్యారెక్టర్ నచ్చలేదట . ఆ కారణంగా రిజెక్ట్ చేసారట . ప్రభాస్ - రష్మిక కాంబోలో  ఫస్ట్ సినిమా మిస్ అయింది .



ఆ తర్వాత "చావా" సినిమా.  నిజానికి డైరెక్టర్ ఈ సినిమాని పాన్ ఇండియా లెవెల్ లో అనుకోని ప్రభాస్ ని హీరోగా అనుకున్నారట . కానీ ప్రభాస్ ఇలాంటి ఒక క్యారెక్టర్ లో నటించలేను అంటూ తన బాడికి ఈ క్యారెక్టర్ సూట్ అవ్వదు అంటూ రిజెక్ట్ చేయడంతో ఆ తర్వాత ఆ పాత్రలోకి విక్కీ కౌశల్ వచ్చారు . హైలెట్ ఏంటంటే.. ఈ సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అయ్యింది.  ఈ సినిమాలో కూడా రష్మిక మందన్నానే హీరోయిన్ . ఇక ఫైనల్లీ  "కుబేర" శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ ప్రాజెక్ట్ . ఈ సినిమా రీసెంట్గా రిలీజ్ అయి ఎంత పెద్ద హిట్ అయ్యింది అనేది అందరికీ తెలుసు . ఈ సినిమాని ముందుగా మన తెలుగు హీరోతో చేయాలి అంటూ శేఖర్ కమ్ముల పలువురు  తెలుగు హీరోలని అప్రోచ్ అయ్యారట.  వాళ్లల్లో  ప్రభాస్ పేరు కూడా వినిపించింది . ప్రభాస్ వరుస్స ప్రాజెక్టులతో బిజీగా ఉండడంతో రిజెక్ట్ చేసారట . ప్రభాస్ - రష్మిక కాంబో  రావాల్సిన సినిమాలు మిస్ అయ్యాయి . ఫైనల్లీ వాటన్నిటిని సక్సెస్ఫుల్గా ఉపయోగించుకొని.. సూపర్ సక్సెస్ అయిపోయింది రష్మిక మందన్నా..!

మరింత సమాచారం తెలుసుకోండి: