టాలీవుడ్లో స్టార్ హీరోగా పేరుపొందిన జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరుసగా పాన్ ఇండియా చిత్రాలనే చేస్తూ దూసుకుపోతున్నారు. అలా బాలీవుడ్ లో డైరెక్టర్ అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో వస్తున్న చిత్రం వార్ 2. ఇందులో హృతిక్ రోషన్, ఎన్టీఆర్ నటిస్తూ ఉన్నారు. ఆగస్టు 14వ తేదీన గ్రాండ్గా ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. పాన్ ఇండియా లెవెల్ లో ఈ సినిమాని రిలీజ్ చేసేందుకు చిత్ర బృందం సిద్ధమవుతున్న తరుణంలో వార్ 2 కి సంబంధించి అప్డేట్లను కూడా చిత్రబృందం విడుదల చేసింది. గత కొద్దిరోజుల క్రితం విడుదల అయిన టీజర్ లో హీరోయిన్ కియారా అద్వాని ధరించిన బికినీ హైలెట్ అవ్వగా ఎన్టీఆర్, హృతిక్ రోషన్ పేర్లు కూడా హైలెట్గా నిలిచాయి.


వార్ 2 సినిమా తెలుగు థియేట్రికల్ హక్కులని సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ వారు దక్కించుకున్నారు. తాజాగా ఈ నిర్మాణ అధినేత సూర్యదేవర నాగ వంశీ సోషల్ మీడియా లో ఒక వీడియోతో స్పెషల్గా రిలీజ్ చేయడం జరిగింది. హ్యాట్రీక్ కొట్టబోతున్నం విధ్వంసం సృష్టిస్తున్న వార్ 2 సినిమా తెలుగు రైట్స్ ని దక్కించుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఆగస్టు 14న థియేటర్లలో పండుగ షూరు అంటూ రాసుకువచ్చారు.


అందుకు సంబంధించి ఒక వీడియోని కూడా వైరల్ గా చేయడంతో ఈ వీడియో వైరల్ గా మారుతున్నది. ఈ వీడియోలో అరవింద సమేత పోస్టర్ తో పాటు, దేవర సినిమా పోస్టర్లను చూపిస్తూ వార్ 2 సినిమాతో హ్యాట్రిక్  కొట్టబోతున్నాం అన్నట్టుగా చూపించారు. ఈ వీడియో అభిమానులను తెగ ఆకట్టుకున్నట్టుగా కనిపిస్తోంది. మొత్తానికి సూర్యదేవర నాగవంశీ కూడా తెలుగు సినిమా ప్రమోషన్స్ ను మొదలుపెట్టినట్టుగా అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. తెలుగు థియేట్రికల్ రైట్స్ కూడా చాలా గట్టి పోటీ ఉన్నప్పటికీ ఇతర నిర్మాతలతో పోటీపడి తీసుకున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: