ప్రముఖ సీనియర్ నటుడుగా పేరుపొందిన ఫిష్ వెంకట్ గత కొన్నేళ్ళుగా అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయంపై ఎన్నోసార్లు సహాయం చేయాలని కుటుంబ సభ్యులకు కూడా చాలామందిని వేడుకోవడం జరిగింది. ప్రస్తుతం ఫిష్ వెంకట్ ఆరోగ్యం చాలా క్షీణించిందని రెండు కిడ్నీలు కూడా పూర్తిగా పాడైపోయాయని.. వెంటిలేటర్ల పైన ఉంటూ చికిత్స తీసుకుంటున్నారని వార్తలు వినిపించాయి.అందుకు తగ్గట్టుగా ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో హీరో ప్రభాస్ ఫిష్ వెంకట్ కి రూ.50 లక్షల రూపాయలు సహాయం చేశారనే వార్తలు వినిపించాయి.



దీంతో గత రెండు మూడు రోజుల నుంచి ఎక్కువగా వినిపించడంతో తాజాగా ఫిష్ వెంకట్ కూతురు ఈ విషయం పైన క్లారిటీ ఇస్తే ఒక వీడియోను కూడా విడుదల చేశారు.. ఈ వీడియోలో ఫిష్ వెంకట్ కూతురు స్రవంతి ఇలా మాట్లాడుతూ ప్రభాస్ సహాయం చేస్తున్న వార్తలలో ఏ విధంగా నిజం లేదని.. అది కేవలం ఫేక్ వార్త అంటూ తెలియజేసింది. ప్రభాస్ పిఏ ఒకరు కాల్ చేశారని వివరాలు తెలుసుకొని మరి సహాయం చేయబోతున్నారనే విధంగా వినిపించాయి. కానీ ఇప్పటివరకు వారి నుంచి ఎలాంటి సహాయం అందలేదని వెల్లడించారు.


తమకు వచ్చిన నెంబర్ కు కూడా కాల్ చేసిన ఎవరు లిఫ్ట్ చేయడం లేదంటూ స్రవంతి వెల్లడించింది. దయచేసి ఎవరూ కూడా ఇలాంటి ఫేక్ కాల్స్ చేయొద్దండి మా నాన్న ఫిష్  వెంకట ఆరోగ్యం రోజురోజుకి చాలా క్షీణిస్తోందని ఇండస్ట్రీ నుంచి మాకు ఎలాంటి సహాయం రాలేదు. ఇలాంటి ఫేక్ వార్తలు చెప్పి ఇచ్చేవాళ్లను కూడా ఇవ్వకుండా చేయకండి అంటూ వేడుకుంది. మరి ఈ విషయం పైన ప్రభాస్ టీం ఏమైనా స్పందిస్తుందేమో చూడాలి మరి. సుమారుగా 140కి పైగా చిత్రాలలో నటించిన ఫిష్ వెంకట్ పరిస్థితి చూసి చాలామంది కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: