- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

దిల్ రాజు నిర్మాత .. ఎంసీఏ - వకీల్ సాబ్‌ లాంటి హిట్ సినిమాలు తెర‌కెక్కించిన వేణు శ్రీరామ్ దర్శకుడు .. నితిన్ హీరో , పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బ్లాక్ బస్టర్ తమ్ముడు టైటిల్ వాడుకున్నారు. ఒకప్పటి హీరోయిన్ లయ ఈ సినిమా తో టాలీవుడ్‌లోకి తిరిగి రీ ఎంట్రీ ఇచ్చింది. ఇవన్నీ చూసి కచ్చితంగా సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుందని అనుకున్నారు. అయితే థియేటర్లలో సినిమా చూసిన ప్రేక్షకులకు చుక్కలు కనపడుతున్నాయి అన్న కామెంట్లు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. 20 ఏళ్ల క్రితం విడిపోయిన అక్కని కలుసుకోవాలని విల్లంబులతో సహా హీరోయిన్ తీసుకుని బయలు దేరతాడు హీరో. అమర గొడుగు అనే గ్రామం రెండు రాష్ట్రాలకు చెందినది అట .. అందుకని అక్కడ ఏ చట్టం పనిచేయదట..! కచ్చితంగా మొదడు మోకాళ్ళలో నుంచి చిటికెన వేలుకు దిగజారితేనే ఇలాంటి ఐడియాలు వస్తాయి అన్న కామెంట్లు వినిపిస్తున్నాయి.


ల‌య‌ కూతురికి వెక్కిళ్ళ వ్యాధి ఉంటుంది .. హీరో పాట పాడి త‌గ్గించేస్తాడు. నెలలు నిండిన అమ్మాయి అరుపులు చేజింగ్ లో కూడా లైవ్. ఫస్ట్ ఆఫ్ పూర్తి అయ్యేసరికి చాలామందికి సినిమా మీద ఆశలు పోయాయి. కనీసం సెకండ్ ఆఫ్ అయినా బాగుంటుంది అని పంటి బిగువతో సీట్ల‌ల్లో కూర్చున్న వాళ్లకు చుక్కలు కనిపించేసాయి తమ్ముడు. సినిమాకు తొలి రోజు ప్రపంచ వ్యాప్తంగా కేవలం నాలుగు కోట్ల రూపాయల గ్రాస్ వ‌సూళ్లు వచ్చాయి అంటే ఈ సినిమాని ప్రేక్షకులు ఏ స్థాయిలో తిరస్కరించారో అర్థమవుతుంది. ఏది ఏమైనా దిల్ రాజు తన బ్యానర్ రేంజ్ కు తగినట్టుగా సరైన కథ‌, కథనాలు ఎంచుకుని సినిమాలు నిర్మిస్తే బాగుంటుందని అభిప్రాయాలు సర్వత్రా వినిపిస్తున్నాయి.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: