ఈ మధ్యకాలంలో అల్లు అర్జున్ ని కావాలనే టార్గెట్ చేసి ట్రోల్ చేసే జనాల లిస్ట్ ఎక్కువ అయిపోతుంది. అల్లు అర్జున్ మంచి చేసిన చెడు చేసిన అది చెడుగానే చూస్తున్నారు ..కొన్ని విషయాలలో అసలు అల్లు అర్జున్ కి ఏం సంబంధం లేకపోయినా.. సరే కావాలని ఆయన పుష్ప సినిమాను అడ్డుపెట్టుకొని ఆయనను లాగి మరి ట్రోల్ చేస్తున్నారు.  రీసెంట్గా మరొకసారి అదే పని చేశారు ఆకతాయిలు.  అల్లు అర్జున్ అమెరికాలోని ఫ్లోరిడా, టంపా నగరం లో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు . అక్కడ జరిగే నార్త్ అమెరికా తెలుగు సొసైటీ 2025 సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరయ్యాడు .


ఈ క్రమంలోనే అల్లు అర్జున్ చూసేందుకు ఆయన ఫ్యాన్స్ అదేవిధంగా అక్కడ ఉండే జనాలు ఎగబడ్డారు. నాట్స్ పెద్దలు ఆయనకు ఘన స్వాగతం పలికారు.  ఈ కార్యక్రమంలో  ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజల ముందు అల్లు అర్జున్ మాట్లాడే అవకాశం దక్కించుకున్నారు . అభిమానుల్లో ఆయన ఉత్సాహం డబుల్ స్థాయిలో కనిపించింది.  మూడు రోజులపాటు జరిగే ఈ వేడుకల పలువురు టాలీవుడ్ స్టార్ సెలబ్రెటీస్ కూడా పాల్గొంటున్నారు . అయితే అల్లు అర్జున్ కి అమెరికా , యూకే , ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాలలో విశేషమైన ఫ్యాన్ బేస్ ఉంది అన్న విషయం అందరికీ తెలుసు. ఇప్పుడు నాట్స్  ద్వారా ప్రత్యక్షకంగా అభిమానులను కలవడం పట్ల ఆయన భవిష్యత్తు చిత్రాలకు అంతర్జాతియంగా మంచి మార్కెట్ ఉంటుంది అంటూ సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు .



కాగా అమెరికాలో అల్లు అర్జున్ ని చూడగానే అక్కడ జనాలు ఫోటోల కోసం ఎగబడ్డారు . ఆయనతో ఫోటోలు తీసుకోవడానికి భారీ సంఖ్యలో అక్కడికి తరలివచ్చారు జనాలు.  ఈ క్రమంలోనే  అల్లు అర్జున్ కూడా ఓపికగా వాళ్ళకి ఫోటోలు ఇస్తూ చిరునవ్వుతో సెల్ఫీలు దిగారు . బొకేలను తీసుకొని వాళ్ళ ప్రేమకు ఇంప్రెస్ అయిపోయారు . అయితే అల్లు అర్జున్ అక్కడ వాళ్ళ ఫోటోలు తీసుకుంటున్న మూమెంట్లో ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ ఆ పద్ధతి చూసి అందరూ అల్లు అర్జున్  ఇంకా పుష్ప రాజ్  క్యారెక్టర్ నుంచి దిగలేదేని ..అల్లు అర్జున్ కి హెడ్ వెయిట్ అలానే చూపిస్తున్నాడు అని రకరకాలుగా మాట్లాడుతూ .. కావాలనే అల్లు అర్జున్ పేరుని ట్రోల్ చేస్తున్నారు.  కానీ అల్లు అర్జున్ అభిమానులు మాత్రం ఆ ట్రోలింగ్ ని తిప్పి కొడుతున్నారు.  అల్లు అర్జున్ ఎప్పటికీ స్టార్ హీరోనే అని ఎవరు ఎన్ని ప్లాన్స్ చేసిన అయన స్థానాన్ని ఎవరు దక్కించుకోలేరు అని ఘాటుగా రియాక్ట్ అవుతున్నారు.  సోషల్ మీడియాలో సినిమా ఇండస్ట్రీలో అల్లు అర్జున్ అమెరికాలో దిగిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి . కొంతమంది అమెరికాలో కూడా పరువు పోగొట్టుకున్నావా..?? బాస్సు అంటూ ఆయన అరెస్ట్ ని మరోసారి హైలెట్ చేసి మాట్లాడుకుంటున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: