ప్రతి సంవత్సరం తెలుగు తెలుగు సినీ పరిశ్రమంలోకి ఎంతో మంది ముద్దుగుమ్మలు ఎంట్రీ ఇస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. అందులో కొంత మంది కి మాత్రమే అద్భుతమైన గుర్తింపు లభిస్తూ ఉంటే మరి కొంత మంది మాత్రం చాలా తక్కువ కాలం లోనే కనబడకుండా పోతున్నారు. ఒక ముద్దుగుమ్మ మాత్రం మంచి విజయాలను దక్కించుకోకపోయినా సూపర్ సాలిడ్ క్రేజ్ ను తెలుగు సినీ పరిశ్రమలో దక్కించుకుంది. ప్రస్తుతం ఈమె తెలుగు లో సినిమాలు చేయకపోయినా ఈమె గురించి చాలా మంది కి తెలుసు. ఇంతకు ఆ ముద్దు గుమ్మ ఎవరు అనుకుంటున్నారా ..? ఆమె మరెవరో కాదు తెలుగు సినీ పరిశ్రమలో చాలా సినిమాల్లో నటించి తన అందాలతో , నటనతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న భావన.

బ్యూటీ గోపీచంద్ హీరోగా రూపొందిన ఒంటరి అనే సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేక పోయింది. ఆ తర్వాత ఈమె నితిన్ హీరోగా రూపొందిన హీరో అనే సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర డిజాస్టర్ అయ్యింది. ఆ తర్వాత ఈమె పలు తెలుగు సినిమాలలో నటించింది. కానీ ఈమెకు తెలుగులో చెప్పుకోదగ్గ విజయాలు దక్కలేదు. దానితో ఈమెకు ఆ తర్వాత కాలంలో టాలీవుడ్ ఇండస్ట్రీ లో  అవకాశాలు కూడా తగ్గాయి. ఇక తెలుగు తో పాటు ఈ బ్యూటీ మరికొన్ని భాషల సినిమాల్లో కూడా నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. 

ఈమెకు పెద్దగా విజయాలు దక్కకపోయినా  ఈమె నటించిన సినిమాలలో తన అందంతో , నటనతో ప్రేక్షకులలో ఈమె ఆకట్టుకోవడంతో ఈమెకు తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు ఉంది. ఇకపోతే ప్రస్తుతం ఈమె చిన్న నాటి ఓ ఫోటో ఒకటి వైరల్ అవుతుంది. అందులో ఈమె కిరీటం పెట్టుకొని యువరాణి స్టిల్ ఇచ్చింది. ప్రస్తుతం ఆ ఫోటో సూపర్ గా వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: