టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ డైరెక్టర్లలో అనిల్ రావిపూడి ఒకరు. ఈయన పటాస్ మూవీతో దర్శకుడిగా కెరిర్ ను మొదలు పెట్టి ఈ మూవీ తోనే దర్శకుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఈ మూవీ కంటే ముందు ఈయన చాలా సినిమాలకు కథ రచయితగా పని చేశాడు. ఈయన కథా రచయితగా పని చేసిన సినిమాలలో కూడా కొన్ని సినిమాలు మంచి విజయాలను అందుకున్నాయి. అనిల్ రావిపూడి దర్శకుడిగా ఇప్పటివరకు ఒక అపజయాన్ని కూడా అందుకోలేదు.

ఈయన దర్శకత్వం వహించిన సినిమాలలో ప్రతి సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఆఖరుగా ఈయన సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాకు దర్శకత్వం వహించాడు. ఆ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం చిరంజీవి హీరోగా నయనతార హీరోయిన్గా మెగా 157 అనే వర్కింగ్ టైటిల్తో రూపొందుతున్న సినిమాను అనిల్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. ఇకపోతే అనిల్ రావిపూడి సినిమాలకు దర్శకత్వం వహించడం మాత్రమే కాకుండా పలు టీవీ షో లకు జడ్జిగా కూడా వ్యవహరిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే ఈయన జడ్జిగా వ్యవహరిస్తున్న షో లలో సుధీర్ కూడా పాల్గొంటూ వస్తున్నాడు.

దానితో తాజాగా ఓ ఇంటర్వ్యూ లో భాగంగా అనిల్ రావిపూడి కి మీరు జడ్జిగా వ్యవహరిస్తున్న షో లలో సుదీర్ ను బాగా ఏడిపిస్తున్నారు. ఆయన దానికి ఏం ఫీల్ కావడం లేదా అనే ప్రశ్న ఎదురయింది. దానికి అనిల్ సమాధానం చెబుతూ ... సుధీర్ చాలా మంచి వాడు. ఆయనను ఏడిపిస్తేనే టీఆర్పి రేటింగ్ బాగా వస్తుంది అని అందరూ అంటున్నారు. దానితో ఆయన కూడా ఏ మాత్రం మొహ మాటం లేకుండా నన్ను ఏడిపించండి సార్ అని అంటూ ఉంటాడు. నేనే కొన్ని సార్లు కొన్నింటిని  కట్ చేస్తూ ఉంటాను. అయినా అతను పర్వాలేదు సార్ అంటూ ఉంటాడు అని అనిల్ రావిపూడి తాజాగా చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: