
ఈ సినిమాలో హీరోయిన్గా మీనాక్షి చౌదరి వేరే లెవెల్ మార్కులు అందుకుంది .సినిమాలోని ప్రతి డైలాగ్ కూడా కామన్ పీపుల్స్ కి కనెక్ట్ అయ్యేలా ఉంది . సినిమా మార్వలెస్. ప్రతి ఒక్కరిని ఆలోచింపజేసింది . అదేవిధంగా మొసపోకుండా జాగ్రత్తగా ఉండేలా చూసుకునేలా చేసింది . ఈ సినిమా సూపర్ హిట్ కావడానికి మెయిన్ రీజన్ స్టోరీ అదేవిధంగా డైలాగ్స్. ఐతే ఇలాంటి సినిమాకి సీక్వెల్ ఎందుకు రాదు..? పరమ చెత్త సినిమాలకి సీక్వెల్స్ వస్తూ ఉంటాయ్.. అని జనాలు చాలామంది మాట్లాడుకున్నారు . లక్కీ భాస్కర్ లాంటి సినిమాకి సీక్వెల్ వస్తే ఇంకా బాగుంటుంది అని కామెంట్స్ పెట్టారు .
బహుశా ఈ కామెంట్స్ వెంకీ అట్లూరీ విన్నాడు ఏమో. అందుకే లక్కీ భాస్కర్ సీక్వెల్ కన్ఫామ్ చేసేసారు . వెంకీ అట్లూరి రీసెంట్గా పాడ్ కాస్ట్ లో మాట్లాడుతూ వెంకీ అట్లూరి లక్కీ భాస్కర్ కి పార్ట్ 2 ఉంటుంది అని చెప్పారు. అయితే ఈ సినిమాలో హీరోగా దుల్కర్ కాకుండా టాలెంటెడ్ తెలుగు హీరోస్ గోపీచంద్, నితిన్ , నాగచైతన్య , సాయిధరమ్ తేజ్ లాంటి వాళ్ళు పెట్టుకుంటే బాగుంటుంది అంటున్నారు జనాలు. వెంకి అట్లూరి గతంలో నాగచైతన్య తో సినిమా తెరకెక్కించాలి అనుకుంటున్నానని.. తను తీసిన ప్రతి సినిమా కథను కూడా ముందుగా నాగచైతన్యకి వినిపించానని కానీ ఆయనతో సినిమా కుదరలేదు అని చెప్పారు. బహుశా నాగచైతన్యతో ఈ సినిమా తీయచ్చేమో అంటూ జనాలు మాట్లాడుకుంటున్నారు . చూద్దాం మరి ఏం జరుగుతుందో ..??? లక్కీ భాస్కర్ సీక్వెల్లో ఎవరిని హీరోగా పెడతారో వేచి చూడాలి ...!! కొంతమంది మాత్రం దుల్కర్ సల్మానే ఈ రోల్ కి బాగా సూట్ అవుతాడు అంటూ కూడా మాట్లాడుతున్నారు. మరి వెంకీ అట్లూరీ డెసిషన్ ఎలా ఉంటుందో..?? వెయిట్ చేసి చూడాలి..!!