బాలీవుడ్ లో హీరోయిన్ గా పేరు పొందిన నోరా ఫతేహీ తెలుగు ఆడియన్స్ కి కూడా బాగా సుపరిచితమే.. ముఖ్యంగా ఎన్టీఆర్ టెంపర్ సినిమాలో ప్రభాస్ బాహుబలి చిత్రంలో అలాగే లోఫర్ తో పాటుగా తదితర చిత్రాలలో స్పెషల్ సాంగులలో అలరించింది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ నటిస్తున్న పీరియాడికల్ యాక్షన్ చిత్రం హరిహర వీరమల్లు లో కూడా ఒక కీలకమైన పాత్రలో నటిస్తున్నది. పలు రకాల సినిమాలు, వెబ్ సిరీస్ లతో బిజీగా ఉండే ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో కూడా నిరంతరం యాక్టివ్గానే ఉంటూ అభిమానులను ఖుషీ చేస్తూ ఉంటుంది.


అయితే తాజాగా నోరా ఫతేహీ ముంబైలో ఒక ఎయిర్ పోర్ట్ లో ఏడుస్తూ కనిపించింది. ఇందుకు సంబంధించిన ఒక వీడియో కూడా వైరల్ గా మారుతున్నది. ఎయిర్ పోర్ట్ లో కనిపించిన సమయంలో నోరా తో కలిసి సెల్ఫీ దిగేందుకు ఒక అభిమాని ప్రయత్నించగా.. ఏడుస్తూ వెళుతున్న ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. నోరా బాడీ గార్డ్ కూడా వెంటనే రియాక్ట్ అవుతూ ఆ యువకుడిని పక్కకు నెట్టేశారు. ఇందుకు సంబంధించి సోషల్ మీడియాలో వీడియో కూడా వైరల్ గా మారింది.

అయితే ఈ విషయం తెలిసిన నోరా ఫతేహీ అభిమానులు కూడా ఎందుకు ఏడ్చిందో ఆమె అర్థం కావడం లేదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. నోరా ఫతేహి ఎయిర్ పోర్ట్ లోకి రాకముందే తన సోషల్ మీడియాలో ఒక ఎమోషనల్ పోస్టుని షేర్ చేసింది. నోరా కుటుంబ సభ్యులు లేదా ఆమె బంధువులలో ఒకరు మరణించి ఉంటారేమో అందుకే ఆమె అలా ఏడిచి వెళ్ళింది అన్నట్లుగా పలువురు నెటిజెన్స్ అభిప్రాయంగా తెలియజేస్తున్నారు.. నోరా ఫతేహీ సినిమాల విషయానికి వస్తే.. గత ఏడాది క్రాక్, మట్కా. తదితర వెబ్ సిరీస్లలో కూడా నటించింది. హరిహర వీరమల్లతో పాటు కాంచన్ 4 చిత్రాలలో నటిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: