టాలీవుడ్ సీనియర్ హీరో కం కమెడియన్ రాజేంద్రప్రసాద్.. తన ప్రసంగాల తప్పులు వల్ల అవతలి వాళ్ళకి కాదు అతనికి కూడా ఎంతో నష్టం చేసుకుంటున్నారు .. రీసెంట్ గానే ఎస్వి కృష్ణారెడ్డి జన్మదిన వేడుకల్లో ఆలీని, అలాగే రాబిన్ హుడ్ ఈవెంట్లో డేవిడ్ వార్నర్ గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాలకు దారితీసాయి .  ఆ తర్వాత ఆయన క్షమాపణ చెప్పటం ఇంకెప్పుడు రిపీట్ చేయనని హామీ ఇవ్వడం జరిగాయి .. అయితే ఇప్పుడు తాజాగా అమెరికాలో జరుగుతున్న తానా సభల్లో తనను తాను పొగుడుకునే క్రమంలో మళ్ళీ పలు పొరపాట్లు చేయటం మరోసారి హాట్‌ టాపిక్ గా మారింది .. అయితే ఈసారి ఇంటర్నేషనల్ లెవెల్ లో .


ప్రధానంగా తన స్పీచ్లో భాగంగా మాట్లాడుతూ మాజీ ప్రధాని స్వర్గీయ పీవీ నరసింహారావు గురించి చెబుతూ రాజేంద్రప్రసాద్ ఆయన కేసులు సూట్ కేసుల్లో ఉన్నప్పుడు తన సినిమాలు చూసే కొంత ఉరటను పొందే వారిని చెప్పటం అందర్నీ కొంత ఆశ్చర్యాన్ని గురి చేసింది .. అలాగే అప్పుడెప్పుడో దివంగత సి.నారాయణరెడ్డి గారు ప్రతి తెలుగు ఇంట్లో మంచం కంచం లాగా రాజేంద్రప్రసాద్ ఉంటారని గర్వంగా చెప్పడం కొంచెం అతిశయోక్తి గాని అనిపించింది .. అలాగే నిమ్మకూరులోని ఎన్టీఆర్ ఇంట్లో తను పుట్టటం, తానా అసోసియేషన్ పుట్టిన 1977లోనే తన సినీ కెరియర్ మొదలైందని చెప్పుకోవటం, అలాగే ససత్య సాయిబాబా జుట్టు మీద జోకులు వేయటం వంటివి చాలా మందికి కొంత ఇబ్బందికరంగా అనిపించాయి .



తన సినీ జీవితంలో ఎన్నో ఎత్తు పల్లాలు చూసిన రాజేంద్రప్రసాద్ ఇలా మాట్లాడటం కొత్త కాకపోయినా .. అంత పెద్ద వేదిక మీద ఇలాంటి స్పీచ్ ఇవ్వటం మీద ఎన్నో కామెంట్లు వస్తున్నాయి .. టాలీవుడ్ సీనియర్ ఆర్టిస్టుల్లో ఎంతో బిజీగా ఉన్న వారిలో ఈయన ముందు వరుసలో ఉన్నారు. ఇలాంటి సమయంలో మరింత హుందాగా జాగ్రత్తగా ఉండాలి తప్ప అనవసరంగా పక్క వారు వేలెత్తి చూపేలా ఉండకూడదు .. ఒకప్పుడు ఎన్నో గొప్ప సినిమాలు ఇండస్ట్రీకి అందించిన మాట వాస్తవమే కానీ అవి లేకపోతే పరిశ్రమ  ఏమైందో అన్న రేంజ్ లో చెప్పుకోవడం అనేది మంచిది కాదు .  ఇలా మొత్తానికి రాజేంద్రప్రసాద్ మరోసారి సోషల్ మీడియాలో హాట్‌ టాపిక్ గా మారారు .

మరింత సమాచారం తెలుసుకోండి: