తెలుగు సినిమా ఇండస్ట్రీలోని సీనియర్ స్టార్ హీరోయిన్లలో అనుష్క శెట్టి కూడా ఒకరు. సూపర్ అనే చిత్రం ద్వారా తెలుగు సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టింది అనుష్క శెట్టి.. అరుంధతి చిత్రంతో స్టార్డం సొంతం చేసుకుంది. అలాంటి ఈమె తాజాగా ఘాటీ అనే చిత్రం ప్రమోషన్స్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..  తాను ఇండస్ట్రీలోకి ఏ విధంగా వచ్చానో అసలు సినిమాల్లో చేద్దామని అస్సలు అనుకోలేదని చెప్పుకొచ్చింది..మరి ఆ వివరాలు ఏంటో చూద్దాం.. తాను చదువుకునే రోజుల్లో సినిమాలు పెద్దగా చూసే దాన్ని కాదని అన్నది.. ఆ తర్వాత సినిమా ఆఫర్లు వచ్చి షూటింగ్ హడావిడి చూసి చాలా కంగారుపడ్డానని,ఒకానొక సమయంలో ఏడ్చానని  కూడా చెప్పింది. ఈ హడావిడి అంతా చూసి యోగా టీచర్ గానే బాగుంటుంది.. 

ఈ సినిమాలు వద్దు  ఏం వద్దు అనుకున్నానని, కానీ నా కెరియర్ ని పూర్తిగా మార్చేసింది అరుంధతి చిత్రం అంటూ చెప్పుకొచ్చింది.. సూపర్ చిత్రంతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన ఈమె గ్లామరస్ పాత్రలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది. ఆ తర్వాత వరుస చిత్రాలు చేసుకుంటూ చివరికి బాహుబలి చిత్రం ద్వారా పాన్ ఇండియా రేంజ్ కి వెళ్ళిపోయింది. మంచి పొజిషన్లో ఉండగానే సైజ్ జీరో సినిమా కోసం ఆమె బరువు పెరగడం వల్ల ఇండస్ట్రీలో కాస్త ఫేడ్ అవుట్ అయిపోయింది. ఆ తర్వాత రెండు సంవత్సరాల గ్యాప్ తీసుకుని మళ్లీ ఫామ్ లోకి వచ్చింది అనుష్క. తాజాగా ఆమె ఘాటీ అనే సినిమాతో  మన ముందుకు రాబోతోంది.

 ఈ ప్రమోషన్స్ లో భాగంగానే పలు ఇంటర్వ్యూలు ఇస్తూ తన కెరీర్ కు సంబంధించిన ఎత్తు పల్లాలు అందరికీ తెలియజేసింది. ఇండస్ట్రీ లోకి వచ్చినప్పుడు ఆ హడావిడి అంతా చూసి అసలు సినిమాలే వద్దనుకున్నాను. కానీ ఆ సమయంలో అరుంధతి సినిమా నా లైఫ్ ఇన్ టర్న్ చేసింది. ఈ చిత్రం తర్వాత వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు అంటూ చెప్పుకొచ్చింది. అలా దశాబ్ద కాలానికి పైగా సినిమాల్లో రాణిస్తూ వస్తున్నానని  అన్నది. అలాగే నాకు హర్రర్ సినిమాలు అంటే చాలా భయం.. కానీ భాగమతి సినిమా నేను చేసా కానీ ఆ చిత్రాన్ని నేను చూడలేదు అంటూ ఆమె తెలియజేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: