సోషల్ మీడియా అందుబాటు లోకి వచ్చినప్పటి నుంచి సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు ఎలాంటి తప్పు చేయాలన్న  భయపడి పోయే పరిస్థితిలు ఉన్నాయి. అంతేకాదు ఏ చిన్న తప్పు చేసిన క్షణాల్లో జనాలు విమర్శిస్తున్నారు.. ముఖ్యంగా  ట్రోలింగ్ లు ఎక్కువ అయిపోయాయి. ఒకటి వ్యక్తిత్వ హననానికి సంబంధించినవి ఉంటే, మరికొన్ని  సరదాగా సాగుతూ ఉంటాయి.. అయితే ఓసారి బాలకృష్ణ అల్లు అర్జున్ మధ్య జరిగినటువంటి చిన్న ఫన్నీ ఇన్సిడెంట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..దీనికి కారణం ఏంటి వివరాలు చూద్దాం.. 

అప్పట్లో తెలంగాణ గద్దర్ ఫిలిం పేర్ అవార్డుల ఫంక్షన్ జరిగిన సమయంలో అల్లు అర్జున్ మరియు బాలకృష్ణ మధ్య ఒక ఫన్నీ ఇన్సిడెంట్ జరిగింది.. అదేంటో చూద్దామా..ఒక సాంగ్ వస్తున్న సమయంలో బాలకృష్ణ అల్లు అర్జున్ చేయి పట్టుకుని పదవెల్లి డాన్స్ చేద్దాం అన్నాడు..వెంటనే అల్లు అర్జున్ తన చేయి వెనక్కి లాక్కొని నావల్ల కాదు అంటూ నవ్వుతూ సున్నితంగా తిరస్కరించాడు.. కట్ చేస్తే.. ఇప్పుడు అలాంటిదే మరో సందర్భం ఎదురైంది.. అల్లు అర్జున్ ఒక కార్యక్రమంలో పాల్గొనడానికి అమెరికా వెళ్లి అక్కడ బన్నీ శ్రీలీలా పక్కపక్కనే కూర్చున్నారు..ఇదే సమయంలో అబ్బనీ తీయని దెబ్బ అంటూ ఒక పాట వచ్చింది. వెంటనే యాక్టివ్ అయిన బన్నీ హుషారుగా వచ్చి శ్రీలీలా చేయి పట్టుకుని వెళ్లి డాన్స్ చేద్దాం అన్నాడు.

దీంతో శ్రీలీలా నవ్వుతూ నో అంటూ తిరస్కరించింది.. అయితే ఈ రెండు క్లిప్పులను ఒక దగ్గర చేర్చి నేటిజన్స్ ట్రోల్  చేస్తున్నారు.. అప్పుడు బాలకృష్ణ రమ్మంటే వద్దన్నారు ఇప్పుడు శ్రీలీలాతో డ్యాన్స్ చేయడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అంటూ నెటిజెన్స్ కామెంట్లతో ఏకిపారేస్తున్నారు..అల్లు అర్జున్, శ్రీలీల ఇద్దరు కలిసి పుష్ప-2 సినిమాలో కిస్సిక్ అనే సాంగ్ లో నటించిన సంగతి మనకు తెలిసిందే... పుష్ప-2 సినిమా సమయంలో ఉన్న సాన్నిహిత్యం వల్లే అల్లు అర్జున్ అలా డాన్స్ చేద్దామని అడిగారని అల్లు అర్జున్ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: