సోషల్ మీడియా వేదికగా సెలబ్రిటీలు అప్పుడప్పుడు వారి అభిమానులతో ముచ్చటిస్తూ ఉంటారు. అలా ముచ్చటించే సమయంలో వారు తమ వ్యక్తిగత విషయాలను కూడా సోషల్ మీడియా వేదికగా తమ అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. ఇకపోతే తెలుగు సినీ పరిశ్రమలో నటిగా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న వారిలో నీది అగర్వాల్ ఒకరు ఈమె సవ్యసాచి అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది. ఈ మూవీ లో నాగచైతన్య హీరోగా నటించాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఈ బ్యూటీ తన కెరీర్లో మొట్ట మొదటి విజయాన్ని ఇస్మార్ట్ శంకర్ సినిమాతో అందుకుంది.

ఇకపోతే తాజాగా ఈ బ్యూటీ పవన్ కళ్యాణ్ హీరో గా జ్యోతి కృష్ణ దర్శకత్వంలో l రూపొందిన హరి హర వీరమల్లు అనే సినిమాలలో హీరోయిన్గా నటించింది. ఈ మూవీ ని జూలై 25 వ తేదీన విడుదల చేయనున్నారు. ప్రస్తుతం ఈ నటి ప్రభాస్ హీరోగా రూపొందుతున్న రాజా సాబ్ కూడా హీరోయిన్గా నటిస్తోంది. ఈ మూవీ పై కూడా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇది ఇలా ఉంటే తాజాగా నిధి అగర్వాల్ తన సోషల్ మీడియా వేదికగా #asknidhhi  అంటూ ఫ్యాన్స్ తో చాట్ చేసింది. తాజాగా నీది సోషల్ మీడియా వేదికగా చేసిన చిట్ చాట్ లో ఎక్కువ మంది హరిహర వీరమల్లు సినిమాకు సంబంధించిన అప్డేట్లను అడిగారు. ఆమె కూడా ఆ సినిమాకు సంబంధించిన కొన్ని విషయాలను చెప్పింది. ఇకపోతే ఓ అభిమాని మాత్రం ఆమెను ఒక చిలిపి ప్రశ్న అడిగాడు. ఆమె కూడా ఆ ప్రశ్నకు అంతే చిలిపిగా రెస్పాన్స్ ఇచ్చింది. తాజాగా నిధి అగర్వాల్ చిట్ చాట్ లో భాగంగా ఓ అభిమాని ఈ బ్యూటీ నెంబర్ ఇస్తే మన పెళ్లి సంబంధం గురించి మాట్లాడతా అని అన్నాడు. అందుకు నీది అవునా నాటి అంటూ క్యూట్ గా రిప్లై ఇచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: