ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి యంగ్ హీరోయిన్లలో  శ్రీలీల ఒకరు.. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం ఉన్నటువంటి అతి తక్కువ వయసు హీరోయిన్లలో ఈమె కూడా ఒకరని చెప్పుకోవచ్చు.. దాదాపు 20 సంవత్సరాల వయసులోనే సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి  సినిమాల్లోకి వచ్చిన కొద్ది కాలంలోనే స్టార్ డం సంపాదించుకుంది. పెళ్లి సందD అనే చిత్రం ద్వారా తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ తనదైన పెర్ఫార్మెన్స్ తో అందరి దృష్టిలో పడింది. ఆ చిత్రం ఫ్లాప్ అయినా కానీ ఈమె నటనకు మాత్రం మంచి మార్కులు పడ్డాయి. ఆ తర్వాత ఈమెకు రవితేజ,బాలకృష్ణ, మహేష్ బాబు, రామ్ పోతినేని, నితిన్ లాంటి స్టార్ హీరోలతో నటించే అవకాశం వచ్చింది. 

ముఖ్యంగా రవితేజ తో నటించిన ధమాకా చిత్రంలో శ్రీలీల హీరోయిన్ గా నటించి అద్భుతమైన హిట్ అందుకుంది. ఇక ఈ సినిమా తర్వాత శ్రీలీల వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ప్రస్తుతం చేతిలో అరడజన్ కి పైగా సినిమాలు ఉన్నాయి. ఇలా ఇట్స్ ఫ్లాప్స్ అనే సంబంధం లేకుండా  సినిమాల్లో,పలు కమర్షియల్ యాడ్స్ లో చేస్తూ దూసుకుపోతోంది ఈ ముద్దుగుమ్మ.. కేవలం సినిమాలే కాకుండా తన సొంత లైఫ్ లో పలువురు హీరోలతో డేటింగ్ లు చేసిందంటూ కొన్ని రూమర్లు కూడా వినిపిస్తున్నాయి.. అయితే తాజాగా ఈ యంగ్ బ్యూటీ  హీరో కార్తీక్ ఆర్యన్ తో డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి..

 అంతేకాదు ఇటీవలే ఆర్యన్ శ్రీలీల కలిసి  ఒక హోటల్ కి కూడా వెళ్లారని,అక్కడ డిన్నర్ చేసి కాసేపు సరదాగా గడిపినట్టు తెలుస్తోంది. ఈ విధంగా శ్రీలీల కార్తీక్ ఆర్యన్ తో ఒక విధమైన రిలేషన్ ని పెనవేసుకుంది.. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో వీరిద్దరి మధ్య ప్రేమ కుదిరిందని చాలామంది అనుకుంటున్నారు. నిజంగానే వీరిద్దరి మధ్య లవ్ ఉందా.. లేదంటే స్నేహాన్ని మెయింటైన్ చేస్తున్నారా అనేది తెలియాలంటే ఈ ప్రచారంపై వారు తప్పకుండా స్పందించి క్లారిటీ ఇవ్వాల్సిందేనని నెటిజన్లు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: