
టాలీవుడ్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం దర్శకుడు బుచ్చిబాబు సానా దర్శకత్వంలో పెద్ది సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా రూరల్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ఫస్ట్ షాట్ గ్లింప్స్ కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాతో రామ్ చరణ్ పాన్ ఇండియా బాక్సాఫీస్ దగ్గర దుమ్ము లేపటం ఖాయమని అందరూ భావిస్తున్నారు. ఇక రామ్ చరణ్ తర్వాత సినిమాని ఏ దర్శకుడు తో చేస్తాడా ? అనే ప్రశ్న మెగా అభిమానులలో నెలకొంది. గతంలో క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్‌తో రామ్ చరణ్ 17వ సినిమా ఉంటుందని టాక్ వచ్చింది. తర్వాత రాంచరణ్ ఇతర డైరెక్టర్లతో సినిమా చేసే అవకాశాలు ఉన్నాయని కూడా వార్తలు వచ్చాయి. దీంతో సుకుమార్తో రామ్ చరణ్ సినిమా చేస్తాడా లేదా అనే సందేహం అందరిలోనూ క్రియేట్ అయింది.
ఇక లేటెస్ట్ ప్రకారం రాంచరణ్ 17వ సినిమా ఖచ్చితంగా సుకుమార్ తోనే ఉంటుందని తెలుస్తోంది. దీంతో చరణ్ అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయా యి. గతంలో రామ్ చరణ్ - సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన రంగస్థలం సినిమా బాక్సాఫీస్ దగ్గర సూపర్ డూపర్ హిట్ అయింది. ఆ తర్వాత పుష్ప 1 , పుష్ప 2 సినిమాలతో సుకుమార్ క్రేజ్ దేశవ్యాప్తంగా మార్మోగుతుంది. ఈ టైం లో రామ్ చరణ్ - సుకుమార్ కాంబినేషన్లో సినిమా వస్తే ఏ స్థాయిలో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు