
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా ఈ నెల 24న థియేటర్లలోకి వస్తోంది. అయితే ఇప్పుడు వీరమల్లు సినిమాకు మరో కష్టం వచ్చేలా కనిపిస్తోంది. వీరమల్లు వచ్చిన వారం రోజులకే విజయ్ దేవరకొండ కింగ్డమ్ సినిమా వస్తోంది. ఈ మేరకు చిన్న టీజర్ రిలీజ్ చేసి మరి రిలీజ్ డేట్ ప్రకటించారు నిర్మాత నాగవంశీ. దీంతో పవన్ కళ్యాణ్ అభిమానులు అతడి పై సోషల్ మీడియా వేదికగా ఫైర్ అవుతున్నారు. మొన్నటి వరకు కింగ్‌డమ్ తేదీకి వీరమల్లు వస్తుందని అనుకున్నారు. వీరమల్లు కోసమే కింగ్డమ్ సినిమాను వాయిదా వేసినట్టు చెప్పారు. అయితే వీరమల్లు వాయిదాల మీద వాయిదాలు పడింది.. చెప్పిన టైం కు రాలేదు. ఒక దశలో వీరమల్లు - కింగ్డమ్ రెండు సినిమాల్లో ఒకేరోజు రిలీజ్ అవుతున్నాయి అన్న ప్రచారం జరిగింది.
మరి ఒక రోజు గ్యాప్ లో వస్తే పవన్ కళ్యాణ్ అభిమానుల ఆగ్రహాన్ని చూడాల్సి వస్తుందని భావించి వారం రోజుల గ్యాప్ ఇచ్చారు. అయినా నాగ వంశీకి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ నుంచి ఎటాక్ తప్పలేదు. ఇలా పోటీపడి వారం రోజుల గ్యాప్ లో రాకపోతే ఇంకాస్త ఎక్కువ గ్యాప్ తీసుకోవచ్చు కదా అన్న చర్చలు టాలీవుడ్ ట్రేడ్ వర్గాలలో వినిపిస్తున్నాయి. అయితే సినిమా రిలీజ్ డేట్ లో ఇప్పుడు ఓటిటి సంస్థల చేతులలోకి వెళ్లిపోయాయి. దీంతో వీరమల్లు - కింగ్డమ్ సినిమాల మధ్య ఈ పోటీ తప్పలేదని ప్రచారం జరుగుతుంది. కింగ్డమ్ సినిమాకు హిట్టు టాక్ వస్తే కచ్చితంగా వీరమల్లు వసూళ్లపై ప్రభావం చూపుతోందని అందరూ భావిస్తున్నారు.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు