- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన హరిహర వీరమల్లు సినిమా ఈనెల 24న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలోకి వస్తుంది. చాలా లాంగ్ గ్యాప్ తర్వాత అందులోనూ పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత రిలీజ్ అవుతున్న తొలి సినిమా కావడంతో అంచనాలు మామూలుగా లేవు. ఇప్పుడు ఈ సినిమా నుంచి మెయిన్ హైలెట్స్ బయటకు వస్తున్నాయి. హీరోయిన్ నిధి అగర్వాల్ వీరమల్లు సినిమా హైలెట్స్ లీక్ చేసేసింది. వీర‌మ‌ల్లు ఇంటర్వెల్ ఎపిసోడ్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందట. అదే ఊపు ఇంట‌ర్వెల్‌ తర్వాత సెకండాఫ్ లో కూడా కొనసాగుతుందట. ఇక క్లైమాక్స్ అయితే ఒక రేంజ్ లో ఉంటుందని చెబుతోంది. ఇంటర్వెల్ నుంచి క్లైమాక్స్ వరకు సినిమా అదిరిపోతుందట.


ఇలా నిధి అగర్వాల్ తన అభిమానులతో చిట్ చాట్ చేసి సినిమాలో మెయిన్ హైలెట్స్ మొత్తం లీక్ చేసేసింది. సినిమాలో తన పాత్ర కూడా చాలా బాగుంటుందని చెబుతోంది. ఇప్పటివరకు తన పోషించిన పాత్రలలో చాలా కష్టమైన పాత్ర వీరమల్లు సినిమాలో ఉంటుందని గుర్రపు స్వారి .. కొన్ని క్లాసికల్ డాన్స్ మూమెంట్స్ కోసం చాలా బాగా కష్టపడ్డాను అని చెబుతోంది. ఇంకోసారి పవన్ కళ్యాణ్ సార్ సార్ నటించే ఛాన్స్ వస్తే ఈ జన్మకు అది చాలు అంటుంది నిధి అగర్వాల్. మరి నిధి కోరిక పవన్ కళ్యాణ్ నెరవేరుస్తాడా అన్నది చూడాల్సి ఉంది.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: