పవన్ కళ్యాణ్ క్రిష్ కాంబినేషన్లో తెరకెక్కిన హరిహర వీరమల్లు సినిమా ఈ నెల 24వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో 140 కోట్ల రూపాయల బిజినెస్ జరిగిందని తెలుస్తోంది. 2 గంటల 40 నిమిషాల రన్ టైంతో ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుందని సమాచారం అందుతోంది.

ఓవర్సీస్ లో ఈ సినిమాకు సంబంధించి అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం అయ్యాయని తెలుస్తోంది.  ఈ సినిమాకు ప్రీ బుకింగ్స్ బాగానే ఉన్నాయని భోగట్టా. ఈ సినిమా ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిన నేపథ్యంలో  ఈ  సినిమాకు బిజినెస్ సైతం అంచనాలకు మించి జరుగుతోందని సమాచారం అందుతోంది.

పవన్ కళ్యాణ్ నటించి  చాలా కాలం గ్యాప్ తర్వాత విడుదలవుతున్న సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాలు  పెరుగుతున్నాయి . ట్రైలర్ లో ఉన్న డైలాగ్స్  సైతం మాటల తూటాలలా పేలాయి. హీరోయిన్ నిధి అగర్వాల్ సైతం ఈ సినిమా కచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుందనే నమ్మకం కలిగేలా కామెంట్లు చేశారు. పవన్ ఈ సినిమాకు పరిమితంగా రెమ్యునరేషన్ తీసుకున్నారని తెలుస్తోంది.

పెద్దగా పోటీ లేకుండా థియేటర్లలో విడుదలవుతూ  ఉండటం  ఈ సినిమాకు ప్లస్ అయింది. హరిహర వీరమల్లు మూవీ   టాలీవుడ్ బిగ్గెస్ట్ హిట్లతో ఒకటిగా నిలవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.  హరిహర వీరమల్లు మూవీ దాదాపుగా 300 కోట్ల రూపాయల  బడ్జెట్ తో  తెరకెక్కింది.  ఈ సినిమా సక్సెస్ సాధించడం నిర్మాత ఏఎం రత్నంకు  కీలకమనే సంగతి తెలిసిందే.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: