గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. చరణ్ "ఆర్ ఆర్ ఆర్" లాంటి బ్లాక్బస్టర్ విజయం తర్వాత తన తండ్రి నటించిన ఆచార్య మూవీ లో ఓ చిన్న పాత్రలో నటించాడు. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ గా నిలిచింది. కానీ ఈ సినిమాలో చరణ్ నటనతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాడు. ఇకపోతే ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా చరణ్ నటించి గేమ్ చేంజర్ మూవీ విడుదల అయింది. అత్యంత భారీ అంచనాల నడుమ పాన్ ఇండియా మూవీ గా విడుదల అయిన ఈ సినిమా కూడా చరణ్ కి నిరాశనే మిగిల్చింది.

ప్రస్తుతం చరణ్ , బుచ్చిబాబు సనా దర్శకత్వంలో రూపొందుతున్న పెద్ది అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. జాన్వీ కపూర్ ఈ మూవీ లో హీరోయిన్గా నటిస్తూ ఉండగా ... శివ రాజ్ కుమార్ , జగపతిబాబు , దివ్యాంధు ఈ మూవీ లో కీలక పాత్రలలో కనిపించనున్నారు. ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ ని వృద్ధి సినిమాస్ , మైత్రి సంస్థ , సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ల వారు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం మార్చి 27 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇకపోతే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన షూటింగ్ అప్డేట్ ఒకటి బయటకు వచ్చింది.

ఆ అప్డేట్ ప్రకారం ... ఈ మూవీ యొక్క నెక్స్ట్ షెడ్యూల్ నాసిక్ లో జరగబోతున్నట్లు తెలుస్తోంది. అక్టోబర్ చివరి నాటికి లేదా నవంబర్ నాటికి ఈ మూవీ కి సంబంధించిన మొత్తం షూటింగ్ను పూర్తి చేయాలి అని ఈ మూవీ దర్శకుడు బుచ్చిబాబు పక్కా ప్లాన్ చేసుకున్నట్లు తెలుస్తుంది. ఈ మూవీ యొక్క చివరి షెడ్యూల్ ను ఢిల్లీ స్టేడియంలో షూటింగ్ చేసే విధంగా ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది. ఈ స్టేడియంలో ఫైనల్ మ్యాచ్ సీన్స్ ను రూపొందించబోతున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ప్రస్తుతం పెద్ది సినిమాపై అదిరిపోయే రేంజ్ లో అంచనాలు ప్రేక్షకుల్లో నెలకొని ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: