ఉదయ్ కిరణ్ చనిపోయాక ఎంతోమంది ఆయనను తలుచుకొని ఏడ్చారు.ముఖ్యంగా ఆయనతో నటించిన లేడీ ఆర్టిస్టులు అయితే కన్నీళ్లు పెట్టుకున్న సంగతి మనకు తెలిసిందే. అయితే ఆయన మరణం పై మాట్లాడి కన్నీళ్లు పెట్టుకున్న వాళ్లే ఉన్నారు తప్ప ఆయన చనిపోయి మంచి పని చేశారు అని అన్నవాళ్ళు ఇప్పటివరకు ఎవరూ లేరు. కానీ అలాంటిది మొదటిసారి ఓ నటుడు ఉదయ్ కిరణ్ చనిపోయి మంచి పనే చేశారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మరి ఇంతకీ ఉదయ్ కిరణ్ చనిపోయి మంచి పని చేశారంటూ చెత్త మాటలు మాట్లాడిన ఆ నటుడు ఎవరు అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఉదయ్ కిరణ్ చనిపోయి మంచి పని చేశారు..

 ఆయన బతికుండి కూడా వేస్ట్ అని మాట్లాడింది ఎవరో కాదు బిగ్ బాస్ విన్నర్ కౌశల్ నందా.. ఆయన తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఉదయ్ కిరణ్ తో కలిసి నేను దాదాపు 13 సినిమాలు చేశాను. మా ఇద్దరి మధ్య మంచి బాండింగ్ ఉంది. సినిమాల్లోకి రాకముందే ఉదయ్ కిరణ్ నాకు తెలుసు.అప్పుడప్పుడు నేను ఉదయ్ ఇంటికి కూడా వెళ్లేవాడిని.అలా మా మధ్య మంచి స్నేహం ఉంది.అయితే ఉదయ్ కిరణ్ చిన్న స్థాయి నుండి పెద్ద స్థాయికి ఎదిగారు. ఆయన స్టార్డం ని కొంతమంది ఓర్వలేకపోయారు. దాంతో ఆయనకి అవకాశాలు రాకుండా ఆపేశారు. అయితే ఇప్పుడు ఇండస్ట్రీలో గనుక ఆయన ఉంటే మరింత కుంగిపోయేవారు.

ఆయన చనిపోయి మంచి పనే చేశారు. ఎందుకంటే ఇలాంటి సమాజంలో బతికి ఉండడం వేస్ట్.. ఒకరు ఎదుగుతున్నారంటే వారిని కిందికి లాగడానికి ఎంతో మంది ట్రై చేస్తూ ఉంటారు. వారిపై నెగటివ్ ట్రోలింగ్ చేయడం.. ఫేక్ కామెంట్లు చేయడం..వారి ఆత్మగౌరవం దెబ్బతినేలా మాట్లాడడం చేస్తూ ఉంటారు. వీటన్నింటినీ భరిస్తూ బతికుండే కంటే ఉదయ్ కిరణ్ చచ్చిపోయి మంచి పనే చేశారు.అయితే ఆయన చనిపోయి మంచి పని చేశారు అని అనకూడదు. కానీ ఇప్పుడున్న సమాజంలో ఉన్నవారిని దృష్టిలో పెట్టుకుంటే మాత్రం ఆయన చనిపోవడమే బెటర్ అని నా అభిప్రాయం అంటూ షాకింగ్ కామెంట్లు చేశారు బిగ్ బాస్ విన్నర్ కౌశల్ నందా.. ఇక ఇక ఉదయ్ కిరణ్ నటించిన చాలా సినిమాల్లో కౌశల్ నందా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: