
అమెజాన్ 55 కోట్ల వరకు బేరానికి వచ్చింది .. అటు ఇటుగా 60 కోట్లకు డీల్ క్లోజ్ అయ్యే అవకాశం ఉంది .. సినిమా నుంచి టీజర్ కూడా బయటికి రాకుండా ఓటీటీ అమ్మకం జరిగిపోవటం నిజంగా గ్రేట్ అని చెప్పాలి .. కాంబినేషన్ పై ఉన్న నమ్మకంతో ఓటీటీ రేట్లకు రెక్కలు వచ్చాయి . ఆగస్ట్ 22 చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా టీజర్ రిలీజ్ చేయబోతున్నారు .. అలాగే టైటిల్ కూడా ఇప్పటికే ఫిక్స్ అయిందని అంటున్నారు .. మంచి ముహూర్తం చూసుకుని టైటిల్ ను అధికారికంగా ప్రకటించబోతున్నారని కూడా అంటున్నారు .. అయితే టైటిల్ లో సంక్రాంతి సౌండ్ వినిపించే అవకాశం ఉందని అంటున్నారు ..
పండగ సినిమా పైగా సంక్రాంతికి వస్తున్నాం సూపర్ హిట్ అయిన సెంటిమెంట్ దర్శకుడికి ఉంది .. అందుకే అలాంటి టైటిల్ కోసమే చూస్తున్నారట .. వెంకటేష్ కూడా ఈ సినిమాల్లో ఓ కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసింది .. దాదాపు 20 రోజులకు కాల్ షీట్లు అవసరం ఓ పాటలో కూడా వెంకీ కనిపించబోతున్నారని అంటున్నారు .. ప్రస్తుతం హైదరాబాద్లో షూటింగ్ జరుపుకుంటుంది .. కొన్ని కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు .. ఈ సినిమాకి బీమ్స్ సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే .. ఇప్పటికే రమణ గోగులతో ఓ పాట కూడా పాటించారు . అలాగే చిరంజీవి కూడా ఒక పాట పాడే అవకాశాలు ఉన్నాయని కూడా అంటున్నారు ..