తెలుగు సినీ పరిశ్రమలో మంచి క్రేజ్ కలిగిన యువ నటులలో విజయ్ దేవరకొండ ఒకరు. ఈయన ఇప్పటివరకు ఎన్నో సినిమాలలో నటించి అందులో కొన్ని మూవీలతో మంచి విజయాలను అందుకొని యువతలో మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఈ మధ్య కాలంలో విజయ్ నటించిన చాలా సినిమాలు వరుసగా బోల్తా కొడుతూ వస్తున్నాయి. విజయ్ కొంత కాలం క్రితం లైగర్ అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ అపజయాన్ని ఎదుర్కొంది. అలాగే విజయ్ నటించిన ఖుషి , ది ఫ్యామిలీ మ్యాన్ సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర పరాజయాలను ఎదుర్కున్నాయి.

ఇలా వరస అపజయలతో డీలా పడిపోయి ఉన్న విజయ్ తాజాగా కింగ్డమ్ అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ లో భాగ్యశ్రీ బోర్స్ హీరోయిన్గా నటించగా ... గౌతమ్ తిన్ననూరి ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ ని సీతార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సూర్య దేవర నాగ వంశీ నిర్మించాడు. ఇకపోతే ఈ మూవీ విడుదల తేదీ పై అనేక వార్తలు వచ్చాయి. తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమాను ఈ సంవత్సరం జూలై 31 వ తేదీన విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. తాజాగా మూవీ కి సంబంధించిన ఓ న్యూస్ వైరల్ గా మారింది. ఈ సినిమాను మొదట తెలుగు , తమిళ్ , హిందీ భాషల్లో విడుదల చేయాలి అని మేకర్స్ ప్లాన్ చేశారట.

కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ సినిమాను తెలుగు , తమిళ్ భాషలో మాత్రమే థియేటర్లలో విడుదల చేయాలి అని , ఈ మూవీ కి సంబంధించిన హిందీ వర్షన్ ను థియేటర్లలో కాకుండా నేరుగా ఓ టీ టీ లో విడుదల చేయాలి అని ఈ మూవీ బృందం డెసిషన్ కి వచ్చినట్లు తెలుస్తోంది. ఇకపోతే మంచి టాక్ వస్తే హిందీ ఏరియాలో తెలుగు సినిమాలకు మంచి కలెక్షన్స్ వస్తున్నాయి. అలాంటి సమయంలో ఈ మూవీ హిందీ లో థియేటర్లలో విడుదల కావడం లేదు అనే వార్త వైరల్ కావడంతో విజయ్ ఫ్యాన్స్ కాస్త డిసప్పాయింట్ అవుతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Vd