సినిమా ఇండస్ట్రీ లో కొంత మంది బ్యూటీలు స్టార్ హీరోయిన్లుగా కెరియర్ను కొనసాగించి ఆ తర్వాత సినిమాల్లో అవకాశాలు తగ్గాక టీవీ షోలకు జడ్జిలుగా వ్యవహరించడం , అలాగే సినిమాల్లో చిన్న చిన్న పాత్రలలో నటిస్తూ సందడి చేయడం అనేది మనం సర్వసాధారణంగా చూస్తూనే వస్తున్నాం. ఇకపోతే ఓ ఇద్దరు బ్యూటీలు మాత్రం ఓ వైపు స్టార్ హీరోల సినిమాల్లో కూడా నటిస్తూనే మరోవైపు అద్భుతమైన క్రేసి కలిగిన టీవీ షోలకు జడ్జిలుగా వ్యవహరిస్తూ అద్భుతమైన క్రేజ్ లో దూసుకుపోతున్నారు. ఇంతకు ఆ ఇద్దరు క్రేజీ బ్యూటీ లు ఎవరు అనుకుంటున్నారా ..? వారు ఎవరో కాదు తెలుగు సినీ పరిశ్రమలో చాలా కాలం పాటు అద్భుతమైన స్థాయిలో కెరియర్ను కొనసాగించిన ప్రియమణి , సదా.

ప్రియమణి "పెళ్లయిన కొత్తలో" అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యి మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని , మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. ఆ తర్వాత అనేక సంవత్సరాలు పాటు టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన నటిగా కెరియర్ను కొనసాగించింది. ఇప్పుడు అడపాదప సినిమాల్లో నటిస్తుంది. అలాగే పలు టీవీ షో లకు జడ్జ్ గా వ్యవహారుస్తూ అద్భుతమైన జోష్లో కెరియర్ను ముందుకు సాగిస్తుంది. సదా "జయం" అనే మూవీ తో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ మంచి విజయం సాధించడంతో ఈమెకు ఆ తర్వాత అనేక తెలుగు సినిమాలలో అవకాశాలు వచ్చాయి. ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ ఇండస్ట్రీ లో చాలా కాలం పాటు అద్భుతమైన స్థాయిలో కెరియర్ను కొనసాగించింది. ఇప్పుడు కూడా ఈమె సినిమాల్లో నటిస్తోంది. అలాగే పలు టీవీ షో లకు జడ్జ్ గా వ్యవహారిస్తుంది. ఇలా ఇద్దరు బ్యూటీలు సినిమాల్లో నటిస్తూ టీవీ షో లకు జడ్జిలుగా వ్యవహరిస్తూ మంచి జోష్లో కెరీర్లు ముందుకు సాగిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: