దసరా విలన్ షైన్ టామ్ చాకో అందరికీ తెలుసు. నాని,కీర్తి సురేష్ కాంబినేషన్లో వచ్చిన పాన్ ఇండియా మూవీ దసరాలో నానికి విలన్ గా షైన్ టైం చాకో నటించిన సంగతి మనకు తెలిసిందే. ఈ సినిమాలో అసలు ఈయన విలనేనా అనేలా రూపురేఖలు ఉంటాయి. అయితే దసరా సినిమా తర్వాత షైన్ టైం చాకోకి మంచి గుర్తింపు వచ్చింది.దీంతో ఈయనకి సినిమాల్లో ఆఫర్స్ పెరిగాయి.అయితే సడన్గా ఈ హీరో లైంగిక వేధింపుల కేసులో ఇరుక్కున్నారు.అది కూడా తనతో కలిసి నటించినా ఓ హీరోయిన్ చేసింది. అంతేకాదు షైన్ టైం చాకో మీద లైంగిక ఆరోపణలు చేసినా కూడా ఇండస్ట్రీ వాళ్ళు పట్టించుకోకపోవడంతో నాకు న్యాయం చేయరా.. నేను ఫిర్యాదు చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోరా అంటూ మీడియా ముఖంగాగానే ప్రశ్నించింది. 

అయితే సినిమా షూటింగ్స్ సెట్లో షైన్ టైం చాకో తనతో అసభ్యంగా ప్రవర్తించాడని, లైంగికంగా వేధించాడని ఆయన నాతో ప్రవర్తించిన ఆ ప్రవర్తన చాలా అసౌకర్యంగా ఉందని ఫిలిం ఇండస్ట్రీకి ఫిర్యాదు చేసిన సంగతి మనకు తెలిసిందే. అయితే తాజాగా షైన్ టైం చాకో ఆ హీరోయిన్ తో ప్రవర్తించిన తీరుపై బహిరంగ క్షమాపణలు చెప్పారు. ఇక విషయంలోకి వెళ్తే..షైన్ టైం చాకో విన్సీ సోనీ అలోషియస్ కాంబినేషన్లో సూత్రవాక్యం అనే మూవీ వస్తోంది. ఈ మూవీ సినిమా షూటింగ్ సమయంలో విన్సీ సోని అలోషియస్ ని షైన్ టామ్ చాకో లైంగికంగా వేధించాడంటూ మలయాళ ఫిలిం ఇండస్ట్రీకి నటి విన్సీ ఫిర్యాదు చేసింది. అయితే తాజాగా సూత్రవాక్యం మూవీ ప్రమోషన్స్ లో భాగంగా తన పక్కనే ఉన్న విల్సి సోని అలోషియస్ కి బహిరంగ క్షమాపణలు చెప్పారు.ఆయన మాట్లాడుతూ.. విన్సీ తో  నేను ప్రవర్తించిన తీరుకి బహిరంగ క్షమాపణలు చెబుతున్నాను.

నేను సరదాకి చేశాను. ఆమెకి ఇబ్బంది కలిగించాలని అనుకోలేదు. ఇక విన్సీ నాపై ఫిర్యాదు చేసే వరకు వచ్చిందంటే దాని వెనుక ఆమెకు ఎవరో ఎంకరేజ్ చేసే ఉంటారని అనుకుంటున్నాను అంటూ చెప్పుకొచ్చాడు. అయితే ఆయన మాటలకు పక్కనే ఉన్న విన్సీ షూటింగ్ సమయంలో షైన్ టామ్ చాకో నుండి ఇలాంటి అనుభవాన్ని నేను ఊహించలేదు. ఆయన ప్రవర్తన వల్ల నేను చాలా బాధపడ్డాను. కానీ నేను చేసిన పనికి ఆయన కుటుంబ సభ్యులు కూడా ఇబ్బంది పడ్డారు.ప్రస్తుతం ఆ వివాదం ముగిసి పోయింది అంటూ చెప్పింది. ఆ తర్వాత నువ్వు నా వల్ల ఇబ్బంది పడ్డందుకు క్షమాపణలు చెబుతున్నాను అంటూ అందరి ముందే షైన్ టామ్ చాకో చెప్పడంతో ఈ క్షమాపణలు చెప్పడంతో మీ పై మరింత గౌరవం పెరిగింది అని విన్సీ ఆన్సర్ ఇచ్చింది. దాంతో విన్సీ షైన్ టైం చాకోల మధ్య ఉన్న వివాదం ఇక్కడితో ముగిసిపోయినట్టు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: