
మరీ ముఖ్యంగా "నీ కళ్ళు నీలి సముద్రం" అనే పాటలో పెట్టిన ఎక్స్ప్రెషన్స్ కుర్రాళ్ళ గుండెలు పిండేసాయి . ఆ పాట ఇప్పటికి సోషల్ మీడియాలో ఆడపదడపా ట్రెండ్ అవుతూనే ఉంటుంది . అలాంటి కృతి శెట్టికి ఇప్పుడు తెలుగు సినిమాలో అవకాశాలు రావడం లేదు . డైరెక్టర్స్ ఆమెను నమ్మి అవకాశం ఇవ్వడం లేదు. దానికి కారణం బ్యాక్ టు బ్యాక్ ఆమె కమిట్ అయిన సినిమాలు ఫ్లాప్ అవ్వడమే. కృతి శెట్టి నటించిన తెలుగు సినిమాలు అన్నీ కూడా ఆల్మోస్ట్ ఆల్ ఆమెకు నెగిటివ్ టాక్ తీసుకొచ్చాయి .
"శ్యాం సింగరాయ్" సినిమా మినహా ఆమెకు తెలుగులో మంచి బ్రేక్ ఇచ్చే సినిమా ఏది రాలేదు. అయినా సరే ఒక డైరెక్టర్ మాత్రం ఆమెకు ఇప్పుడు నమ్మి ఛాన్స్ ఇచ్చాడు అన్న వార్త వినిపిస్తుంది . ఆయన మరెవరో కాదు శేఖర్ కమ్ముల . శేఖర్ కమ్ముల సినిమాలో హీరోయిన్గా నటించాలి అంటే అదృష్టం ఉండాలి అనే అభిప్రాయం అందరికీ ఉంటుంది. ఇప్పుడు ఆ అదృష్టం ఛాన్స్ కొట్టేసింది కృతి శెట్టి. కుబేర సినిమా తర్వాత నాని తో శెఖర్ కమ్ముల ఈ సినిమా తెరకెక్కించబోతున్నాడు అంటూ టాక్ వినిపించింది. అయితే ఈ సినిమాలో హీరోయిన్గా నాని - కృతి శెట్టిని సెలెక్ట్ చేసుకున్నారట . కృతి శెట్టితో ఆల్రెడీ శ్యామ్ సింగరాయ్ సినిమాలో నటించిన అనుభవం ఉంది . పైగా ఈ క్యారెక్టర్ కి కృతి శెట్టి 100% న్యాయం చేయగలదు అంటూ ఆమె పేరుని సజెస్ట్ చేశారట . అందుకు శెఖర్ కమ్ముల కూడా ఓకే చెప్పారట. త్వరలోనే దీనిపై అఫీషియల్ ప్రకటన కూడా రాబోతుందట. ప్రసెంట్ ఈ న్యూస్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది..!!
3