సినిమా ఇండస్ట్రీ లో కొంత మంది హీరోయిన్లకు కెరియర్ ప్రారంభంలో మంచి విజయాలు దక్కకపోయినా ఆ తర్వాత ఒకే ఒక్క సినిమాతో వారి కెరియర్ మారిపోయే సందర్భాలు కూడా అనేకం ఉంటాయి. ఇకపోతే ఓ నటి తెలుగు సినిమాలో నటించిన అది మంచి విజయం సాధించకపోవడంతో ఆమెకు ఆ సినిమా ద్వారా మంచి గుర్తింపు దక్కలేదు. ఆ తర్వాత ఓ తమిళ సినిమాలో నటించింది. ఆ మూవీ అటు తమిళ్ , ఇటు తెలుగు రెండు ఇండస్ట్రీ లలో కూడా మంచి విజయం సాధించడంతో ఈమెకు అద్భుతమైన గుర్తింపు రెండు ఇండస్ట్రీ లలో కూడా దక్కింది.

ఇంతకు ఆ నటి ఎవరు అనుకుంటున్నారా ..? ఆమె మరెవరో కాదు మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటిమణి అయినటువంటి కయాదు లోహర్. ఈమె కొంత కాలం క్రితం శ్రీ విష్ణు హీరో గా రూపొందిన అల్లూరి అనే సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ అయ్యింది. ఈ సినిమా ద్వారా ఈమెకు తెలుగు లో మంచి గుర్తింపు దక్కలేదు. ఆ తర్వాత ఈమె తమిళ్ లో ప్రదీప్ రంగనాథన్ హీరోగా రూపొందిన డ్రాగన్ అనే సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ మూవీ తమిళ్ లో అద్భుతమైన విజయాన్ని అందుకుంది. అలాగే ఈ సినిమా తెలుగు లో కూడా విడుదల అయ్యి టాలీవుడ్ బాక్సా ఫీస్ దగ్గర కూడా మంచి విజయం సాధించింది. ఈ మూవీ తో ఈమె క్రేజ్ ఒక్క సారిగా పెరిగిపోయింది. 

దానితో ఈమె పారితోషంగా కూడా భారీగా పెంచినట్లు తెలుస్తోంది. ఈమె డ్రాగన్ సినిమా కోసం కేవలం 30 లక్షల పారితోషకం మాత్రమే తీసుకోగా , ప్రస్తుతం ఈమె దాదాపు ఒక్కో సినిమాకు మూడు కోట్ల వరకు పారితోషకాన్ని పుచ్చుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇలా ఒకే ఒక్క సినిమాతో ఈమె పారితోషకం భారీ స్థాయిలో పెరిగినట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈమెకు అదిరిపోయే రేంజ్ క్రేజ్ ఉన్న సినిమాలలో వరస పెట్టి అవకాశాలు దక్కుతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Kl