శోభిత ధూళిపాళ్ల.. ఇప్పుడంటే ఓ స్టార్ హీరోయిన్. అక్కినేని ఇంటి కోడలు . అంతకు ముందు మాత్రం ఒక హీరోయిన్ మాత్రమే.  అందరూ ఆమెను అలానే చూసేవాళ్ళు . శోభిత ధూళిపాళ్ల అంటే కష్టంతో పైకి వచ్చిన హీరోయిన్ . బాలీవుడ్లో పలు వెబ్ సిరీస్ లు చేస్తుంది . గాట్ రోల్స్ లో  కూడా అవలీలగా నటించేస్తుంది.  నటనకు ప్రాధాన్యత ఉన్న సినిమాలలోనే ఆమె నటించడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంది. ఇలా మాట్లాడుకునే వాళ్ళు జనాలు.  కాగా నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె కి టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక స్పెషల్ స్థానం కూడా లభించింది .


ఇప్పుడు ఎక్కడ పోయినా సరే ఆమెను శొభిత ధూళిపాళ్ల అని కాదు అక్కినేని ఇంటి కోడలు పిల్ల అని నాగార్జున కోడలు అని గర్వంగా చెప్పుకుంటూ ఉంటారు ఫ్యాన్స్ . అయితే శొభిత ధూళిపాళ్ల గతంలో తెలుగు ఇండస్ట్రీలో ఓ ఐటమ్ సాంగ్ మిస్ చేసుకున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.  ఈ వార్త ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది. సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న "రంగస్థలం" సినిమాలో "జిగేల్ రాణి" సాంగ్లో చూపించాలనుకున్నారట . ఈ సాంగ్ కోసం కొంచెం డిఫరెంట్ హీరోయిన్ ని చూస్ చేసుకోవాలి అని సుకుమార్ ఆలోచిస్తున్నా మూమెంట్లో చాలామంది హీరోయిన్స్  ని అనుకున్నారట .



మరి ముఖ్యంగా కీర్తి సురేష్ అదే విధంగా అంజలి ఇలా రకరకాల హీరోయిన్స్ లను అనుకున్నారట.  ఆ లిస్టులో శోభిత ధూళిపాళ్ల కూడా ఉన్నారట.  కానీ శోభిత ధూళిపాళ్ల ఆఫర్ ని రిజెక్ట్ చేశారట.  ఆమెకు ఐటెం సాంగ్ లో నటించడం ఇష్టం లేక ఇంత పెద్ద స్టార్ హీరో సినిమా రిజెక్ట్ చేసింది అంటూ అప్పట్లో వార్తలు వినిపించాయి . అయితే నాగార్జున ఇంటి కోడలైన తర్వాత మరొక్కసారి ఈ వార్తను ట్రెండ్ చేస్తూ వైరల్ చేస్తున్నారు జనాలు . ప్రజెంట్  శోభిత ధూళిపాళ్ల నాగచైతన్యతో కలిసి ఓ సినిమాలో నటిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.  అది కాకుండా ఓ ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమాలో కూడా నటిస్తుందట.  మరొక పక్క చైతుతో ఫ్యామిలీ లైఫ్ ను ఫుల్ బిజీబిజీగా ఎంజాయ్ చేసేస్తుంది..!

మరింత సమాచారం తెలుసుకోండి: