సినిమా ఇండస్ట్రీకి ఆ 30 రోజులు బిగ్ పండగనే చెప్పాలి.  మరి ముఖ్యంగా సినీ లవర్స్ కి ఇంకా ఎంజాయ్ మెంట్ వస్తుంది.  దాదాపు ఇండస్ట్రీలో తెరకెక్కిన ఆల్మోస్ట్ ఆల్ బిగ్ సినిమాలు ఆ 30 రోజుల గ్యాప్ లోనే రిలీజ్ కాబోతున్నాయి .జూలై 15 నుంచి ఆగస్టు 15 వరకు సినీ ఇండస్ట్రీ కళకళలాడుతుంది . థియేటర్లకు అలాంటి టైం వచ్చింది అని మాట్లాడుకుంటున్నారు జనాలు . వరుసగా భారీ భారీ క్రేజీ సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి . పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన "హరిహర వీరమల్లు".. విజయ్ దేవరకొండ నటించిన "కింగ్ డమ్"..జూనియర్ ఎన్టీఆర్ నటించిన "వార్ 2".. రజనీకాంత్ నటించిన "కూలీ".. ఇలా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు అన్ని రిలీజ్ కాబోతున్నాయి. అన్ని కూడా పెద్ద సినిమాలు కావడం గమనార్హం. అయితే ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలల్లో ప్రజలు మొత్తం 700 కోట్ల రూపాయల వరకు ఈ సినిమాల కోసం ఖర్చు చేయాల్సి ఉంటుంది.  లేకపోతే కచ్చితంగా భారీ బొక్క తప్పదు.


హరిహర వీరమల్లు : పవన్ కళ్యాణ్ కెరియర్ లో చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న  సినిమా ఇది . సినిమా మార్కెట్ ఇంకా వర్క్ జరుగుతూనే ఉంది.  ఎలా లేదన్న 150 నుంచి 200 కోట్లు మెర థియేటర్ హక్కులు విక్రయించాలని చూస్తున్నారు మూవీ మేకర్స్ . మరి ఏం జరుగుతుందో వేచి చూడాలి .

కింగ్ డమ్:  హీరో విజయ్ దేవరకొండ నటించిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాలలో కలిపి 40 కోట్లకు మేర థియేటర్ హక్కులు ఇచ్చారు

వార్ 2: హృతిక్ రోషన్ జూనియర్ ఎన్టీఆర్ నటించిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాల హక్కులు కలిపి 80 కోట్లు అంటూ తెలుస్తుంది .

కూలి: రజనీకాంత్ కెరియర్ లో చాలా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన  ఈ సినిమా కోసం రెండు తెలుగు రాష్ట్రాల హక్కులు 44 కోట్లు అంటూ తెలుస్తుంది.  ఇంకా దీనికి జిఎస్టి అదనం .

అంటే ఈ సినిమా లెక్కలన్నీ కలుపుకుంటే దాదాపు 300 నుంచి 350 కోట్ల షేర్ రాబట్టాలి . తెలుగు రాష్ట్రాల నుంచి మాత్రమే అంటే దగ్గర 700 కోట్ల మాట.  కచ్చితంగా చూసుకుంటే జులై 24 నుంచి ఆగస్టు 24 లోపు 700 కోట్ల రూపాయలు జనాలు సినిమా మీద ఖర్చు చేయాల్సి ఉంటుంది . అయితే ఆ అదృష్టం అన్ని సినిమాలకు వర్తించదు.  ఏ సినిమాకి వరిస్తుందో వేచి చూడాలి. ఇది ఇలా ఉండగా హరిహర వీరమల్లు -కింగ్డమ్ లకు మధ్య వారం రోజులు మాత్రమే గ్యాప్ ఉంది . ఒక విధంగా చెప్పాలి అంటే రెండు సినిమాలకు ఇది కాస్త రిస్క్ ప్రాసెస్ .



హరిహర వీరమల్లు సినిమా హిట్ అయితే వెంటనే విజయ్ దేవరకొండ "కింగ్డమ్" వచ్చేస్తుంది. ఆ సినిమా హిట్ టాక్ సంపాదించుకుంటే హరిహర వీరమల్లుకి కలెక్షన్స్ తగ్గిపోతాయి . ఒకవేళ విజయ్ దేవరకొండ సినిమా ప్లాప్ టాక్ దక్కించుకుంటే హరి హర వీరమల్లు  కలెక్షన్స్ పెరిగిపోతాయ్..అప్పుడు  విజయ్ దేవరకొండ "కింగ్దమ్" మూవీ మేకర్స్ కు భారీ నష్టాలు తప్పవు . ఏదో ఒక సినిమా మాత్రం ఖచ్చితంగా నష్టాలు ఎదుర్కోవాల్సిందే . చూద్దాం మరి ఏం జరుగుతుందో..???

మరింత సమాచారం తెలుసుకోండి: