
అయితే రామ్ చరణ్ తర్వాత సినిమాలకు కూడా మంచి స్టార్ డైరెక్టర్ ల తో కమిట్ అవ్వడం ఇప్పుడు ఇండస్ట్రీలో ట్రెండ్ అవుతుంది . చరణ్ తర్వాత నెక్స్ట్ మూడు సినిమాలను కూడా టాప్ డైరెక్టర్ల దర్శకత్వంలోనే కమిట్ అవ్వడం గమనార్హం. అందుతున్న సమాచారం ప్రకారం సుకుమార్ దర్శకత్వంలో సినిమా అయిపోగానే ఆ తర్వాత ప్రశాంత్ నీల్ తో ప్రాజెక్టును లైన్ లోకి తీసుకొచ్చేలా ప్లాన్ చేశాడట. ఆ తర్వాత సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో సినిమాకి కమిట్ అయ్యాడట. ఆ తర్వాత లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో ఓ సినిమాకి కమిట్ అయ్యాడట.
ఇలా బ్యాక్ టు బ్యాక్ అందరూ కూడా బిగ్ బడా డైరెక్టర్లతోనే సినిమాకు కమిట్ అయ్యాడు రామ్ చరణ్ అంటూ తెలుస్తుంది. దీంతో చరణ్ లైనప్ వేరే లెవల్ లో ఉండబోతుంది అంటూ తెలుస్తుంది. దీని పై మెగా ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. చరణ్ నటించిన సినిమా హిట్ అయితే మాత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఆయన రేంజ్ డబుల్ కాదు త్రిబుల్ స్థాయిలో పెరిగిపోతుంది అంటున్నారు అభిమానులు. ఒకపక్క సినిమాలకు కమిట్ అవుతూనే మరొక పక్క తన వాల్యబుల్ టైం తన కూతురు క్లింకారా తో కూడా టైం స్పెండ్ చేస్తూ ఒకపక్క హీరోగా మరొకపక్క ఫాదర్ గా రెండు పాత్రలకి న్యాయం చేస్తున్నాడు రామ్ చరణ్..!!