హీరోయిన్ ఒకే ఒక్క సినిమాతో ఓవర్ నైట్ లో హీరోయిన్ గా పేరు మార్మోగిపోయింది.ఉదయ్ కిరణ్ తో నటించిన ఈ సినిమాతో హీరోయిన్ కి ఎక్కడలేని క్రేజ్ వచ్చింది. ఇక ఆ హీరోయిన్ ఎవరయ్యా అంటే అనిత హస్సానందాని రెడ్డి అలియాస్ అనిత.. ఉదయ్ కిరణ్ అనిత హీరో హీరోయిన్లుగా తేజ డైరెక్షన్లో వచ్చిన నువ్వు నేను సినిమా 2001లో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అయింది. కథపరంగా మ్యూజిక్ పరంగా సినిమా పెద్ద హిట్ అయింది. ఆర్ పి పట్నాయక్ అందించిన మ్యూజిక్ కూడా సినిమాకి పెద్ద ప్లస్ అయింది.అలా ఈ సినిమా తర్వాత హీరోయిన్ అనిత కి చాలా మంచి క్రేజ్ లభించింది. ఆ తర్వాత వరుస సినిమాలు చేసినప్పటికీ ఈమె చేసిన సినిమాలు అంతగా ప్రేక్షకాదరణ పొందకపోవడంతో అవకాశాలు రాలేదు. అయితే అలాంటి అనిత వ్యాపారవేత్త అయినటువంటి రోహిత్ రెడ్డిని గోవాలో గ్రాండ్గా పెళ్లి చేసుకుంది. వీరి పెళ్లి 2013లో జరిగింది.

అలాగే ఈ జంటకి ఆరవ్ రెడ్డి అనే బాబు కూడా పుట్టారు. అయితే అలాంటి అనిత మళ్లీ సినిమాల్లో రీ ఎంట్రీ కి సిద్ధం అయిపోయింది.హీరో సుహాస్ నటిస్తున్న ఓ భామ అయ్యో రామ మూవీతో రీ ఎంట్రి ఇవ్వబోతోంది.. ఇక ఈ సినిమా ట్రైలర్ రీసెంట్ గా విడుదలైన సంగతి మనకు తెలిసిందే.ఈ విషయం పక్కన పెడితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అనిత రెడ్డి మాట్లాడుతూ.. తన మాజీ గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది.. అనిత మాట్లాడుతూ.. నేను రోహిత్ రెడ్డి కంటే ముందు ఇజాజ్ అనే వ్యక్తితో ప్రేమలో ఉన్నాను.ఆయనతో నా ప్రేమ ఎక్కడి వరకు వెళ్లిందంటే.. పెళ్లి చేసుకునేంతవరకు వెళ్ళింది.అయితే ఇజాజ్ తో ప్రేమ మా అమ్మకు అస్సలు ఇష్టం లేదు. ఆయనతో తిరగడం మానుకోమని చాలాసార్లు చెప్పింది. కానీ మా అమ్మకు ఇష్టం లేకపోయినా సరే నేను ఇజాజ్ మీద ఉన్న ప్రేమతో ఆయనతో చాలా సంవత్సరాలు డేటింగ్ చేశాను.

అయితే మా అమ్మకు ఇజాజ్  ఇష్టం లేకపోవడానికి కారణం ఆయనది మావి వేర్వేరు మతాలు కావడంతో అమ్మకి నచ్చలేదు.అయితే అమ్మ మొదటి నుండి చెప్పేది ఆయన మంచివాడు కాదని కానీ నేను మాత్రం ఆయనతో పీకల్లోతు ప్రేమలో ఉండడం వల్ల దాన్ని గ్రహించలేకపోయాను.నాకు ఇజాజ్ అంటే చెప్పలేనంత ఇష్టం ఉండేది. కానీ ఇజాజ్  మాత్రం నా మీద అయిష్టంతోనే ఉండేవాడు. కానీ నా మీద ప్రేమ లేదు అనే విషయాన్ని స్వయంగా చెప్పకుండా ఆయన ప్రవర్తనతో చూపించేవారు. అలా కొద్ది రోజులు గడిచాక మా ఇద్దరికీ  బ్రేకప్ అయింది.ఆ సమయంలో నేను చాలా ఒంటరిగా ఫీల్ అవ్వడంతో పాటు డిప్రెషన్ లోకి కూడా వెళ్ళిపోయాను. ఇజాజ్ తో నేను డేటింగ్ చేయడం నా లైఫ్ లో నేను చేసిన పెద్ద తప్పు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది హీరోయిన్ అనిత..

మరింత సమాచారం తెలుసుకోండి: