శోభిత‌ ధూళిపాళ్ల.. ఈ తెనాలి భామ‌ను కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తెలుగు అమ్మాయి అయినప్పటికీ శోభిత త‌న ఫిల్మ్ కెరీర్‌ను బాలీవుడ్ లోనే ప్రారంభించింది. 2016లో అనురాగ్ కశ్యప్ దర్శకత్వం వహించిన `రామన్ రాఘవ్ 2.0` మూవీలో తొలిసారిగా నటించి వెండితెరపై మెరిసింది. ఆ తర్వాత బాలీవుడ్ లో వరుస అవకాశాలను అందిపుచ్చుకుంది.


మరోవైపు తెలుగు, మలయాళం, తమిళ్‌, ఆంగ్ల భాషల్లోనూ సినిమాలు చేసింది. తెలుగులో శోభిత చేసింది రెండే సినిమాలు. అందులో ఒక‌టి `గూఢాచారి` కాగా.. మ‌రొక‌టి `మేజర్`. అడివి శేష్ హీరోగా న‌టించిన ఈ రెండు చిత్రాలు పెద్ద హీట్ అయ్యాయి. ఆంధ్రాలో పుట్టి బాలీవుడ్ హీరోయిన్ అనిపించుకున్న శోభిత‌.. చివ‌ర‌కు తెలుగింటికే కోడ‌లు అయింది. యువ‌సామ్రాట్ అక్కినేని నాగ‌చైత‌న్య‌తో ప్రేమ‌లో ప‌డి.. 2024 డిసెంబ‌ర్ లో అత‌నితో క‌లిసి ఏడ‌డుగులు వేసింది.


ప్ర‌స్తుతం అక్కినేని వారింటికి పెద్ద కోడ‌లిగా చ‌లామ‌ణి అవుతున్న శోభితకు టాలీవుడ్ లో ఫేవ‌రెట్ హీరో ఎవ‌రో తెలుసా..? ఆమె భ‌ర్త చైతు మాత్రం కాదు. పోని వాళ్ల మావ‌య్య నాగార్జున అనుకుంటున్నారా.. కానే కాదు. శోభ‌త‌కు టాలీవుడ్ లో మోస్ట్ ఫేవ‌రెట్ హీరో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌. ఈ విష‌యాన్ని గ‌తంలో ఆమె స్వ‌యంగా వెల్ల‌డించింది. ఎన్నోసార్లు ప‌వ‌న్ పై త‌న అభిమానాన్ని కూడా చాటుకుంది. కాగా, శోభిత ఫిల్మ్ కెరీర్ విష‌యానికి వ‌స్తే.. చివ‌రిగా ఈ బ్యూటీ గ‌త ఏడాది బాలీవుడ్ లో విడుద‌లైన `జిగ్రా`లో మెరిసింది. పెళ్లి త‌ర్వాత చైతుతో వెకేష‌న్స్‌, సోష‌ల్ మీడియాలో ఫోటోషూట్లే త‌ప్ప శోభిత నుంచి అప్ క‌మింగ్ ప్రాజెక్ట్స్ కు సంబంధించి ఎటువంటి అప్డేట్స్ లేవు.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: