
తాజాగా బుక్ మై షో వెబ్‌సైట్‌లో కనిపించిన ఓ అప్డేట్ ఆధారంగా ఈ మూవీకి 5 గంటల 27 నిమిషాల (327 నిమిషాలు) రన్‌టైమ్ చూపించబడింది . ఇది నిజమేనా ? లేక కేవలం ప్లేస్‌హోల్డర్ డ్యూరేషన్ మాత్రమేనా అనే దాని పై స్పష్టత లేదు . అయితే ఇది రెండు భాగాలను కలిపిన ఎడిషన్ కావడంతో, అలాంటి లెంగ్త్ సహజమేనని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. అయినా సినిమా చూడడానికి అర్ధరోజు సమయం కావాలంటే అది థియేటర్లకు, ప్రేక్షకులకు ఎంత వరకూ సూటవుతుంది అన్నదే ప్రధాన చర్చగా మారింది.
ఈ భారీ రన్‌టైమ్‌ను దృష్టిలో ఉంచుకుని, మేకర్స్ కొన్ని థియేటర్లలో మల్టీ-ఇంటర్వెల్స్, ఇంటరాక్టివ్ సెషన్స్, ప్రత్యేక బ్రేక్‌లతో ప్రదర్శించే అవకాశాలు ఉన్నాయి. ఇది గేమ్ ఆఫ్ థ్రోన్స్ - మిస్టర్ రాజమౌళి వెర్షన్ అనేలా ఫీలవుతుంది అని అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు . ఈ సినిమా అక్టోబర్ 31న రిలీజ్ అవుతుందన్న అధికారికంగా విడుదల కానుంది , ఇప్పటికే బుక్ మై షోలో 10,000 మందికి పైగా "ఇంటరెస్టెడ్" ట్యాగ్ చేశారు. ఇది సినిమా మీద క్రేజ్ ఏ స్థాయిలో ఉందో స్పష్టంగా చూపిస్తోంది . ప్రభాస్ , రానా , అనుష్క , రమ్యకృష్ణ , సత్యరాజ్, నాజర్ వంటి స్టార్ నటుల తో తెరకెక్కిన బాహుబలి, కేవలం సినిమా కాదు - ఒక భావోద్వేగ యాత్ర. ఇప్పుడు అదే సినిమాను "ఒకే వన్ షాట్ ఎడిషన్"గా మరోసారి థియేటర్లలో చూడగలమంటే ఆ అనుభూతి గురించి మాటలకందదు . ఇక మరి థియేటర్లో ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతి ఇస్తుందో చూడాలి..
