
"మురుగ :ది లార్డ్ ఆఫ్ వార్.. ది గాడ్ ఆఫ్ విస్డం" అనే పుస్తకం తారక్ చేతిలో కనిపించింది . దీంతో అభిమానులు త్రివిక్రమ్ దర్శకత్వం తెరకెక్కబోయే సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ నటించబోతున్నాడు అన్న విషయాన్ని కన్ఫామ్ చేసేసుకున్నారు . నిజానికి ఈ సినిమాను అల్లు అర్జున్ తో తెరకెక్కించాలి అనుకున్నాడు త్రివిక్రమ్ . కానీ కొన్ని కారణాల చేత ఆయన ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకోవడం ..ఆ ప్లేస్ లోకి తారక్ రావడం ఫాస్ట్ గా జరిగిపోయాయి . ఈ సినిమా కి సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇప్పుడు ఇదే న్యూస్ ఫిలిం సర్కిల్స్ తెగ ట్రెండ్ అవుతుంది .
జూనియర్ ఎన్టీఆర్ సుబ్రహ్మణ్యడిగా కనిపించబోయే "మురుగన్" సినిమాలో లీడ్ రోల్ కోసం త్రివిక్రమ్ హీరోయిన్ గా సమంతని చూస్ చేసుకున్నాడు అన్న వార్త ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది. ఈ మధ్యకాలంలో సమంత తెలుగు సినిమాలు అసలు చూస్ చేసుకోలేదు. పైగా ఆమె డైరెక్టర్ రాజ్ నిడమోరు తో డేటింగ్ చేస్తుంది అనేలా వార్తలు వినిపిస్తున్నాయి .దానికి తగ్గట్టే ఫొటోస్ కూడా ట్రెండ్ అవుతున్నాయి. త్వరలోనే వీళ్లు పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ కూడా వార్తలు వినిపిస్తున్నాయి . ఇలాంటి మూమెంట్లోనే త్రివిక్రమ్ శ్రీనివాసరావు - సమంతకి ఒక భారీ ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తుంది .
గతంలో అలియా భట్ నటించిన "జీగ్రా" ప్రమోషన్స్ లో స్టేజ్ పైనే సమంతకి మాట ఇచ్చాడు త్రివిక్రమ్. సమంత కూడా అందుకు ఓకే చేసింది . "మీరు తెలుగు సినిమాల్లో కూడా నటించాలి అని ఇక్కడ జనాలు కోరుకుంటున్నారు అని త్రివిక్రమ్ అడగ్గా ..సమంత కూడా కథలు రాయండి అవకాశం ఇస్తే చేస్తాను " అంటూ ఓపెన్ గానే చెప్పుకొచ్చింది . అప్పటి నుంచి త్రివిక్రమ్ దర్శకత్వంలో సమంత సినిమా రావాలి అంటూ ఫ్యాన్స్ తెగ కోరుకున్నారు . ఫైనల్లీ ఆ దేవుడు వీరి బాధ ఆలకించారు . మురుగన్ సినిమాలో హీరోయిన్గా త్రివిక్రమ్ , సమంతని చూస్ చేసుకున్నారట . ఈ ప్రాజెక్టుకి సమంత కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట . ఆల్మోస్ట్ ఆల్ ఈ ప్రాజెక్ట్ ఫైనలైజ్ అయిపోయినట్లే అని తెలుస్తుంది. దీంతో ఆఫ్టర్ ఏ లాంగ్ టైం సమంత తెలుగు తెరపై చూడబోతున్నాం అన్న ఆనందం ఒకపక్క క్రేజీ హిట్ కాంబో అయిన తారక్ తో స్క్రీన్ షాట్ చేసుకోబోతుంది అన్న ఆనందం మరొకపక్క ఫ్యాన్స్ కి మంచి ఫీలింగ్ ఇస్తుంది. చూడాలి మరి సమంత ఈ పాత్ర ద్వారా తన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ విధంగా పెంచుకుంటుందో ..?? గతంలో జూనియర్ ఎన్టీఆర్ సమంత కాంబోలో వచ్చిన ప్రతి సినిమా కూడా హిట్ అయిన విషయం అందరికీ తెలుసు..!!