టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ సాలిడ్ క్రేజ్ కలిగిన నటులలో జగపతిబాబు ఒకరు. ఈయన కెరియర్ను మొదలు పెట్టిన తర్వాత ఎన్నో సంవత్సరాల పాటు హీరోగా నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఈయన కెరియర్ లో కొన్ని సంవత్సరాల పాటు హీరోగా నటించిన సినిమాలు వరుసగా బోల్తా కొడుతూ రావడంతో హీరోగా ఈయన క్రేజ్ చాలా వరకు పడిపోయింది. అలాంటి సమయంలోనే ఈయన హీరోగా కాకుండా విలన్ పాత్రలలో నటించాలి అని నిర్ణయించుకున్నాడు. అందులో భాగంగా బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన లెజెండ్ మూవీ లో విలన్ పాత్రలో నటించాడు.

మూవీ అద్భుతమైన విజయం సాధించడం , ఇందులో జగపతి బాబు తన విలనీజంతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో జగపతి బాబు కు ఈ మూవీ ద్వారా మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత ఈయన అనేక సినిమాల్లో విలన్ పాత్రలలో నటించాడు. కేవలం తెలుగు సినిమాల్లో మాత్రమే కాకుండా జగపతి బాబు ప్రస్తుతం అనేక ఇతర భాష సినిమాల్లో కూడా నటిస్తూ అత్యంత బిజీగా కెరియర్ను ముందుకు సాగిస్తున్నాడు. జగపతి బాబు కొంత కాలం క్రితం ఓ ఇంటర్వ్యూలో భాగంగా ఒక హీరోయిన్ మొహం మీదే నువ్వంటే నాకు ఇష్టం లేదు అని చెప్పినట్లు చెప్పాడు. మరి ఎందుకు అలా చెప్పాడు ..? అసలు ఏం జరిగింది ఆయన వివరాలను తెలుసుకుందాం. ఒకా నొక ఇంటర్వ్యూలో భాగంగా జగపతి బాబు మాట్లాడుతూ ... నాకు , రామ్ గోపాల్ వర్మ కు అస్సలు పడదు. ఎప్పుడూ కొట్టుకుంటూనే ఉంటాం. జగపతి బాబు సరదాగా ... మూడు పెగ్గులు వేశాక మా ఇద్దరి మధ్య గొడవ జరుగుతుంది అని చెప్పాడు. 

గాయం మూవీ సమయంలో రామ్ గోపాల్ వర్మ నన్ను ఊర్మిల అంటే నీకు ఎందుకు ఇష్టం లేదు అని అడిగాడు. దానితో నేను నాకు , ఆ అమ్మాయికి కెమిస్ట్రీ బాగా ఉండదు అని చెప్పాను. దానితో ఆర్జీవి , ఊర్మిళను పిలిచి మరి ఈయనకు నువ్వంటే ఇష్టం లేదట అని చెప్పాడు. దానితో ఊర్మిళ నన్ను నేనంటే నీకు ఎందుకు ఇష్టం లేదు అని అడిగింది. దానితో చిరాకు వచ్చి నేను ఊర్మిళ తోనే నువ్వంటే నాకు ఇష్టం లేదు అని చెప్పేసా అని జగపతి బాబు ఓ ఇంటర్వ్యూలో భాగంగా చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Jp