
సమంత ఫిట్ గా ఉంటుందని తెలుసు మరి ఇంత ఫిట్నెస్ నా..? వామ్మో అంటూ కామెంట్స్ పెడుతున్నారు . గత కొద్ది కాలంగా ఫిట్నెస్ , ఆరోగ్యానికి సంబంధించిన విషయాలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ఎక్కువగా పంచుకుంటుంది హీరోయిన్ సమంత . మరీ ముఖ్యంగా ఆమె మయోసైటీస్ వ్యాధి నుంచి కోలుకున్నాక ఇలాంటివి ఎక్కువుగా చేస్తున్నారు. తాజాగా ఇంస్టాగ్రామ్ ద్వారా ఒక వీడియో షేర్ చేసి అందరిని షాకింగ్ కి గురైయ్యేలా చేసింది
.
"మీరు ఎలా కనిపిస్తున్నారు అనేది ఇంపార్టెంట్ కాదు. సమాజానికి మీ వారసత్వం ఏంటి..? అనేది ఇంపార్టెంట్ . సెల్ఫీలు పంచుకోవడం కూడా ఇంపార్టెంట్ కాదు ఎవ్వరు చూడనప్పుడు మీరు ఎంత బలంగా ఉన్నారు అనేది ముఖ్యం "అనే క్యాప్షన్ చేసి పైన పట్టుకొని వేలాడుతున్న వీడియోని షేర్ చేసింది. సమంత చాలా ఫిట్ గా ఉంది అంటూ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా కామెంట్స్ చేస్తున్నారు . ఈ వీడియో తో సమంత అందరిని ఫిదా చేసేసింది. ఈ వీడియోలో సమంత చాలా స్టైలిష్ గా కూడా ఉంది. కాగా డైరెక్టర్ రాజ్ నిడమూరుతో సమంత రెండో పెళ్ళి అంటూ వార్తలు వినిపిస్తున్నాయ్. కానీ దీని పై ఆమె స్పందించడం లేదు..!!