ఒకప్పుడు తెలుగు, తమిళ , కన్నడ భాషల్లో గ్లామర్ భామగా అలరించిన ముద్దుగుమ్మ మాళవిక ... ఇప్పుడు గుర్తుపట్టలేనంత గా మారిపోయి అందర్నీ షాక్‌కు గురి చేస్తోంది . తన అందంతో , అభినయంతో యూత్‌ను ఊర్రూతలూగించిన ఈ భామ ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్‌లో కి అడుగుపెట్టకపోయినా... సోషల్ మీడియా లో మాత్రం హవా కొనసాగిస్తోంది ! మాళవిక అసలు పేరు శ్వేతా కూనూర్ . సినిమా ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ‘మాళవిక’గా మారిపోయింది . తెలుగులో శ్రీకాంత్ , వడ్డే నవీన్ కలిసి నటించిన ‘చాలా బాగుంది’ మూవీతో టాలీవుడ్‌కు పరిచయమైంది. ఆ తర్వాత దీవించండి, శుభకార్యం, నవ్వుతూ బ్రతకాలిరా, ప్రియా నేస్తమా, అప్పారావు డ్రైవింగ్ స్కూల్ వంటి పలు సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.

తెలుగులో మాత్రమే కాకుండా తమిళ్ పరిశ్రమలో కూడా మాళవిక మంచి మార్కు వేసుకుంది. స్టార్ హీరోలతో కలిసి నటించి ప్రేక్షకులను మెప్పించింది. కానీ 2009 తర్వాత ఆకస్మికంగా సినిమాలకు గుడ్‌బై చెప్పేసింది. అప్పటి నుంచి పెద్దగా ఎక్కడా కనిపించలేదు. తాజాగా మాళవిక సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. మేకప్ లేకుండా, క్లీన్ లుక్‌లో కనిపించిన మాళవికను చాలామంది మొదట్లో గుర్తుపట్టలేకపోయారు. ఎప్పుడో గ్లామర్ రోల్స్‌లో మెరిసిన మాళవిక ఇప్పుడలా మారిపోవడంతో అభిమానులు మౌనంగా షాక్ తిన్నారు.

సినిమాలకు దూరమైనా మాళవిక సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌పై యాక్టివ్‌గా ఉంటుంది. రెగ్యులర్‌గా ఫోటోలు, మోమెంట్స్ షేర్ చేస్తూ తన ఫాలోవర్స్‌ను ఎంటర్‌టైన్ చేస్తోంది. కొత్త జెనరేషన్‌కు ఆమె పరిచయం ఉండకపోయినా, ఓల్డ్ స్కూల్ అభిమానులకు మాత్రం ఈ బ్యూటీ ఇప్పటికీ ప్రత్యేకమే. ఇలా డ్రీమ్ గర్ల్ మాళవిక మారిపోయిన లుక్‌తో మళ్లీ ఫోకస్‌లోకి వచ్చింది. అభిమానుల స్పందన చూస్తే, ఆమె సెకండ్ ఇన్నింగ్స్ కూడా బలంగా ఉండే ఛాన్స్ ఉంది. తిరిగి రీ ఎంట్రీ ఇస్తే.. టాలీవుడ్‌కు మరో ఫ్యామిలీ స్టార్ రీబోర్న్ అవుతుందేమో చూడాలి !







మరింత సమాచారం తెలుసుకోండి: