సాధారణంగా ఎన్నికల్లో దొంగ ఓట్ల గురించి చాలా సందర్భాల్లో వార్తలు వచ్చినా దొంగ ఓట్లు వేసిన వాళ్ళ ఫోటోలు ఎప్పుడూ బయటకు రాలేదనే సంగతి తెలిసిందే. అయితే పులివెందుల ఎన్నికల్లో మాత్రం ఆధారాలతో సహా పూర్తి వివరాలు వెల్లడయ్యాయి. పులివెందుల ఉపఎన్నికలో ప్రజాస్వామ్యం అపహాస్యం అయిందని కామెంట్లు వ్యక్తమయ్యాయి.

పులివెందులలో యథేచ్ఛగా దొంగ ఓట్లు వేస్తున్న కొంతమంది ఫోటోలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.  సాధారణంగా ఓటు వేయాలంటే ఏదైనా గుర్తింపు కార్డును చూపించాల్సి ఉంటుంది. పులివెందులలో మాత్రం ఇందుకు భిన్నంగా పరిస్థితి నెలకొందని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవుతూ  ఉండటం గమనార్హం. జమ్మలమడుగు నుండి జనాలను తీసుకెళ్లి నల్లపురెడ్డిపల్లి పోలింగ్ బూత్  లో ఓట్లు వేయించారని తెలుస్తోంది.

టీడీపీలో కీలక హోదాలలో ఉన్న ఇతర ప్రాంతాలకు చెందిన వ్యక్తులు పోలింగ్ లో పాల్గొనడం ఒకింత సంచలనం అవుతోందని చెప్పాలి. కొందరు టీడీపీ లీడర్లు దొంగ ఓట్లు వేశారని సోషల్ మీడియా వేదికగా వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. పులివెందులలో జరిగింది ఓటింగా దొంగ ఓటింగా అని అవినాష్ రెడ్డి  ప్రశ్నించారు. వెబ్ క్యాస్టింగ్ కు సంబంధించిన వీడియోలను రిలీజ్ చేయాలనీ అవినాష్ రెడ్డి కోరారు.

వైసీపీ  అభ్యర్థి హేమంత్ రెడ్డికి వెబ్ క్యాస్టింగ్ వీడియో ఇస్తే తాము దొంగ ఓట్లు వేసిన వారి వివరాలను వెల్లడిస్తామని అవినాష్ రెడ్డి అన్నారు. ఈ ఎన్నికలు చెత్త ఎన్నికలు అని బీహార్ రాష్ట్రంలో సైతం ఇలాంటి ఎన్నికలు జరిగి ఉండవని ఆయన పేర్కొన్నారు. ఓటర్ల స్లిప్పులు లాక్కొని దొంగ ఓట్లు వేశారని అవినాష్ రెడ్డి చెప్పుకొచ్చారు. ప్రశాంతంగా దొంగ ఓటింగ్ జరిగిందని అవినాష్ రెడ్డి తెలిపారు.



వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: