టాలీవుడ్ యంగ్ హీరోయిన్ వర్ష బొల్లమ్మ ఈ మధ్యకాలంలో  పలు చిత్రాలలో నటిస్తూ తెగ సందడి చేస్తోంది. ముఖ్యంగా ఓటీటి లో కూడా నటిస్తూ తన హవా కొనసాగిస్తోంది. ప్రస్తుతం  ఈ ముద్దుగుమ్మ  కానిస్టేబుల్ కనకం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ చిత్రాన్ని ప్రశాంత్ కుమార్ దిమ్మల డైరెక్షన్లో తెరకెక్కిస్తున్నారు. ఇందులో రాజీవ్ కనకాల, అవసరాల శ్రీనివాస్ తదితర నటీనటులు నటిస్తూ ఉన్నారు. ఈ చిత్రం మిస్టరీ థ్రిల్లర్ బ్యాగ్ డ్రాప్ లో తెరకెక్కిస్తున్నట్లు సమాచారం.


ఈ చిత్రాన్ని ఈటీవీ విన్  డైరెక్ట్ గా ఈనెల 14 నుంచి ప్రేక్షకుల ముందుకి రాబోతున్నది. అయితే ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చినటువంటి ప్రతి అప్డేట్ కూడా ప్రేక్షకులను మరింత ఆకట్టుకున్నట్టు కనిపిస్తోంది. దీంతో ఈ సినిమా సమయం దగ్గర పడుతూ ఉండడంతో చిత్ర బృందం ప్రమోషన్స్ ను కూడా వేగవంతంగా చేసింది. ప్రేక్షకులను మరింత అట్రాక్షన్ చేసే పనిలో ఉండగా తాజాగా ఈ చిత్రం నుంచి ఒక వీడియో క్లిప్ ని సోషల్ మీడియాలో వైరల్ చేయగా వైరల్ గా మారింది.


అయితే ఈ వీడియో సినిమా షూటింగ్లో సన్నివేశానికి సంబంధించిన వీడియో అన్నట్లుగా కనిపిస్తోంది.ఈ వీడియోలో వర్ష బొల్లమ్మ ,రాజీవ్ కనకాలను కాలుతో తంతుంది అయితే ఆ తర్వాత రాజీవ్ కనకాల చూశారు కదా ఎంత గట్టిగా తన్నిందో దెబ్బ కూడా తగిలింది అంటూ చెప్పినట్టుగా ఈ వీడియోలో కనిపిస్తోంది. వర్షబొల్లమ్మ సినీ కెరియర్ విషయానికి వస్తే 2015లో మొదటిసారి తమిళ చిత్రం శత్రువునం ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైంది ఆ తర్వాత మలయాళ సినిమాలో నటించిన ఈ ముద్దుగుమ్మ జాను అనే చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తర్వాత పుష్పక విమానం, స్వాతిముత్యం, ఊరి పేరు భైరవకోన, తమ్ముడు తదితర చిత్రాలలో నటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: