యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ బాలీవుడ్ డెబ్యూ `వార్ 2` విడుద‌ల‌కు సిద్ధ‌మైన సంగ‌తి తెలిసిందే. ఈ ఆగస్టు 14న ప్రేక్షకులను అలరించేందుకు ర‌జ‌నీకాంత్ `కూలీ`తో పాటు వార్ 2 కూడా బ‌రిలోకి దిగ‌బోతుంది. హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్ ప్ర‌ధాన పాత్ర‌లు పోషించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ ను యష్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా నిర్మించ‌గా.. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించారు. కియారా అద్వానీ హీరోయిన్ గా యాక్ట్ చేసింది.


ఇప్ప‌టికే అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ కాగా.. టికెట్లు హాట్‌కేక్‌లా అమ్ముడవుతున్నాయి. ఇక‌పోతే వార్ 2 చిత్రానికి వ‌ర‌ల్డ్ వైడ్‌గా క‌ళ్లు చెదిరే రేంజ్‌లో ప్రీ రిలీజ్ బిజినెస్ జ‌రిగింది.  అనుకున్న స్థాయిలో ప్రమోషన్స్ జరగకపోయిన ఎన్టీఆర్ స్టార్డ‌మ్ దృష్ట్యా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ ఏకంగా రూ. 90.50 కోట్ల రేంజ్ లో బిజినెస్ ను సొంతం చేసుకుంది. ఒక డ‌బ్బింగ్ చిత్రానికి ఇది నిజంగా వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బిజినెస్ అని చెప్పుకోవ‌చ్చు.


అలాగే హిందీలో వార్ 2 చిత్రానికి రూ. 175 కోట్ల రేంజ్‌లో ప్రీ రిలీజ్ బిజినెస్ జ‌రిగింది. వ‌ర‌ల్డ్ వైడ్‌గా చూసుకుంటే ఏకంగా రూ. 340 కోట్ల రేంజ్‌లో ప్రీ రిలీజ్ బిజినెస్ ను సొంతం చేసుకుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. ఈ లెక్క‌న వార్ 2 బాక్సాఫీస్ వ‌ద్ద బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే కుంభ స్థ‌లాన్ని కొట్టాల్సిందే. రూ. 342 కోట్ల రేంజ్‌లో షేర్‌, రూ. 700 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ ని అందుకుంటే సినిమా క్లీన్ హిట్ అవుతుంది. తెలుగు రాష్ట్రాల్లో వార్ 2 బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 92 కోట్లు అని అంటున్నారు. మ‌రి ఈ రేంజ్ వ‌సూళ్ల‌ను సినిమా ఏ మేర‌కు అందుకుంటుందో తెలియాలంటే ఫ‌స్ట్ టాక్ బ‌య‌ట‌కు రావాల్సిందే.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: