
ముఖ్యంగా భాగ్యశ్రీ బోర్సే విషయానికొస్తే ఆమె చాలా అందంగా ఉంటుంది, చక్కగా మాట్లాడుతుంది, అందరితో కలిసిపోతుంది, సోషల్ మీడియాలో కూడా హ్యూజ్ ఫాలోయింగ్ ఉంది. కానీ ఎందుకో ఆమె సినిమాలు హిట్ కావడం లేదు. డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు ఆమెకు ఛాన్స్ ఇస్తున్నా, ఆ సినిమాలు ఫ్లాప్ అయితే వెంటనే ఆమె మార్కెట్ తగ్గిపోతుంది. ఒక సినిమాకు తీసుకున్న రెమ్యునరేషన్, రెండో సినిమాకు భారీగా తగ్గిపోతుంది. ఇటీవల ఆమె నటించిన "కింగ్డమ్" సినిమా ఫ్లాప్ కావడంతో, నెక్స్ట్ సినిమా కోసం మేకర్స్ ఆమె రెమ్యునరేషన్ సగం మేర తగ్గించారనే టాక్ వినిపిస్తోంది. గతంలో కూడా కొంతమంది హీరోయిన్‌లపై ఇలాంటి వార్తలు వచ్చాయి. బ్యాక్ టు బ్యాక్ హిట్స్, ఫ్లాప్స్ ఆధారంగా వారి రెమ్యునరేషన్‌కి కోతలు పెట్టిన సందర్భాలు ఉన్నాయి.
సినిమా హిట్ అవ్వడం లేదా ఫ్లాప్ అవ్వడం హీరో లేదా హీరోయిన్ చేతుల్లో ఉండదు. అయినప్పటికీ హీరో రెమ్యునరేషన్‌లో ఎటువంటి మార్పు లేకపోయినా, హీరోయిన్ విషయంలో మాత్రం సగానికి సగం తగ్గించడం ఎంతవరకు సరైనది అని చాలా మంది ప్రశ్నిస్తున్నారు. సినిమా కోసం హీరో ఎంత కష్టపడతాడో, హీరోయిన్ కూడా అంతే కష్టపడుతుంది. అందంగా కనిపించడానికి నోరు కట్టేసుకుని, రకరకాల డైట్‌లు చేస్తూ, వర్కౌట్స్ చేస్తూ పర్ఫెక్ట్‌గా ఉండడానికి ట్రై చేస్తారు. అయినప్పటికీ రెమ్యునరేషన్ విషయంలో మాత్రం ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. హీరో సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా రెమ్యునరేషన్‌లో ఎటువంటి తగ్గింపు లేకుండా కొనసాగుతాడు. కానీ హీరోయిన్స్‌కి మాత్రం ఇలా కోతలు పెట్టడం నిజంగా ఒక పెద్ద సమస్యగా మారిందని ఘాటుగా మాట్లాడుతున్నారు.