రామ్ చరణ్ ఉపాసనల గారాలపట్టి క్లింకార గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సాధారణముగా పిల్లలకు పెట్టే ఆహారం విషయంలో తల్లిదండ్రులు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. పిల్లల వయస్సు ఆధారంగా తీసుకునే ఆహారంలో కీలక మార్పులు చేస్తారనే సంగతి తెలిసిందే. కొందరు తల్లులు పిల్లలకు ఆరోగ్యకరమైన ఆహారాన్ని అలవాటు చేసి పిల్లలకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా జాగ్రత్త పడతారు.

ఉపాసన సైతం తానూ కూడా ఇదే పద్దతిని ఫాలో అవుతానని చెబుతుండటం సోషల్ మీడియా వేదికగా హాట్  టాపిక్ అవుతోంది.  కెరీర్ పరంగా ఉపాసన ఎంత బిజీగా ఉన్నా  తన కూతురు విషయంలో మాత్రం అస్సలు రాజీ పడనని  ఆమె చెబుతున్నారు.  సోషల్ మీడియా, వేర్వేరు సందర్భాల్లో కూతురుకు సంబంధించిన కీలక విషయాలను ఉపాసన పంచుకుంటున్నారు.

తన కూతురుకు పెట్టే  ప్రత్యేక ఆహారం గురించి ఉపాసన కీలక విషయాలను చెప్పుకొచ్చారు.  తన కూతురు డైట్ లో రాగులు ఉండేలా చూసుకుంటానని ఉపాసన తెలిపారు.  నీ కూతురుకు రోజూ రాగుల్ని ఏదో  ఒక రూపంలో తినిపించు అని సద్గురు జగ్గీ వాసుదేవ్ చెప్పారని ఉపాసన తెలిపారు.  ఆయన కూతురు సైతం మా నాన్న రోజూ  మాకు రాగిజావ  తాగించేవాడని పేర్కొన్నారు.  ఈ కారణం వల్లే రోజువారీ డైట్ లో రాగుల్ని చేర్చానని ఉపాసన పేర్కొన్నారు.  

పిల్లలకు ఆరు నెలల వయస్సు నుంచి రాగులను ఇవ్వవచ్చని వైద్యులు సైతం చెబుతున్నారు.  వయస్సును బట్టి చిన్నారులకు  రాగులను  ఇచ్చే మోతాదును సైతం పెంచవచ్చు.  పిల్లలు రక్తహీనత బారిన పడకుండా చేయడంలో రాగులు తోడ్పడతాయి.  ఇందులో ఉండే  అమైనో యాసిడ్స్ సులువుగా, తక్కువ సమయంలో ఇమ్యూనిటీ పవర్ ను పెంచుతాయి.

వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: