
వర్మ మాట్లాడుతూ తాను కొంత బజ్ ఉన్న సినిమాలన్నిటిని చూస్తానని. అందులో కొన్ని థియేటర్లలో చూస్తే మరికొన్ని పైరసీలో కూడా చూస్తాను అంటూ తెలిపారు. పైరసీ అనేది ఆపడం ఎవరి తరము కాదు ప్రేక్షకుడికి సైకలాజికల్ ఎలా ఉంటుందంటే తనకు మంచి సినిమా తక్కువ రేటుకు తక్కువ సమయంలోనే కావాలని ఆశిస్తున్నారు.. అందుకు సంబంధించి టెక్నాలజీ కూడా అందుబాటులో ఉన్న సమయంలోనే ప్రేక్షకులు పైరసీ చూస్తున్నారని .. అలా చూడకుండా ఆపడం ఎవరి వల్ల కాదంటూ వర్మ ఓపెన్ గానే మాట్లాడేశారు.
మేకర్ మాత్రం ఇంకా డబ్బులు కావాలంటూ ఉంటారు మళ్ళీ వాళ్లే పైరసీ ఆపాలంటూ ఉంటారు. టెక్నాలజీ అనేది రెండు వైపుల పదును ఉన్న కత్తిలాంటిది ఒకరికి లాభం చేస్తే మరొక సమయంలో ఇంకొకరికి నష్టం తప్పదు అంటూ తెలియజేశారు. ఇలా వర్మ ఇన్ డైరెక్ట్ గానే అటు టెక్నాలజీ, పైరసీని సపోర్ట్ చేస్తున్నట్లుగా కనిపిస్తోంది..అంతేకాకుండా టికెట్ల రేట్లు పెంచమని నిర్మాతలు డబ్బుల కోసం ఆశ పడుతూ ఉన్నారని.. అలాంటి వాటి వల్ల పైరసీలు ఎక్కువగా వస్తున్నాయనే విధంగా మాట్లాడినట్లు వినిపిస్తున్నాయి.. మొత్తానికి ఆర్జీవి చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.