సాధారణంగా ఇండస్ట్రీలో ఒక హీరోని మరొక హీరో తోక్కేస్తూ ఉండటం చాలా కామన్. ఒక ఇండస్ట్రీ నుంచి వచ్చిన హీరోను వేరొక ఇండస్ట్రీ వాళ్లు పైకి ఎదగనివ్వకపోవడం కూడా అంతే కామన్. అయితే ఇప్పుడు ఇండస్ట్రీలో ఓ న్యూస్ హాట్ టాపిక్‌గా వైరల్‌ అవుతుంది. బిగ్ స్టార్ హీరో సూర్య ని తెలుగు ఇండస్ట్రీలో ఎదగనీకుండా చేస్తున్నారట. దీంతో సూర్య అభిమానులు షాక్ అవుతున్నారు. మనందరికీ తెలిసిందే సూర్య కోలీవుడ్ హీరో. తమిళనాడులో ఆయనకు ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే తన టాలెంట్‌తో తెలుగులో కూడా మంచి అభిమానులను సంపాదించుకున్నాడు. నిజానికి బాలీవుడ్ కంటే ఎక్కువగా తెలుగువాళ్ల ప్రేమను గెలుచుకున్నాడు సూర్య. ఆయన తెరపై నటన, చెప్పే డైలాగ్స్ తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటూ వస్తున్నాయి.


ప్రస్తుతం సూర్య తెలుగు డైరెక్టర్ వెంకీ అట్లూరితో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా కోసం చాలా కష్టపడుతున్నాడు. ఎందుకంటే వరుసగా ఆయన చేసిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయ్యాయి. ముఖ్యంగా కంగువా, రెట్రో సినిమా కూడా ఫ్లాప్ అయింది. ఈ క్రమంలోనే ఎలాగైనా నెక్స్ట్ సినిమా హిట్ కావాలని చాలా పక్కాగా ప్లాన్ చేస్తున్నాడు సూర్య. అయితే ఇప్పుడు .. సూర్య ని తెలుగు ఇండస్ట్రీలో ఎదగనివ్వకుండా ఒక స్టార్ హీరో ప్రయత్నాలు చేస్తున్నాడట. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఆ హీరో తెలుగు హీరో కాదు, కోలీవుడ్‌కి చెందిన స్టార్ హీరో. ఆయనకు తెలుగు ఇండస్ట్రీలో స్టార్స్‌తో మంచి పరిచయాలు ఉన్నాయి. తెలుగులో కొన్ని సినిమాలు కూడా చేశారు కానీ ఆశించినంత హిట్ కాలేదు.



మొదట్లో సూర్య అంటే చాలా అభిమానం ఉండేది. కానీ మధ్యలో ఒక హీరోయిన్ విషయంపై వీళ్లిద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చాయని కోలీవుడ్‌లో టాక్. అప్పటి నుంచి వీళ్లిద్దరూ దూరంగానే ఉంటున్నారు. ఏ మీడియా సమావేశం, ఫంక్షన్‌లో కూడా ముఖం చూసుకోకుండా ఎవరి దారి వాళ్లు వెళ్లిపోతున్నారు. ఇప్పుడు లేటెస్ట్‌గా వస్తున్న వార్త ఏమిటంటే, ఆ హీరో తన తెలుగు ఇండస్ట్రీ ఫ్రెండ్షిప్‌ని ఉపయోగించుకొని సూర్యను ఇక్కడ నిలదొక్కుకోనీయకుండా చేస్తున్నాడట. ఆయన సినిమాలకు మార్కెట్ లేకుండా, అవకాశాలు దెబ్బతీయాలని ప్రయత్నిస్తున్నాడు అని ఓ న్యూస్ బాగా అవిరల్ అవుతుంది.  దీనికి తోడు ఆ కోలీవుడ్ హీరోకి తెలుగు ఇండస్ట్రీలో మరో స్టార్ హీరో సపోర్ట్‌గా ఉన్నాడట. ఇదంతా విని అభిమానులు ఆగ్రహంతో "సూర్య ఎంత మంచి వాడు, ఎవరికీ అపకారం చేయని వాడు. అలాంటి హీరోపై కుట్రలు చేస్తే అవి ఎప్పటికీ నాశనం అవుతాయి" అంటూ రియాక్ట్ అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: