నందమూరి బాలకృష్ణ - బోయపాటి శ్రీను కాంబినేషన్ అంటే టాలీవుడ్ ప్రేక్షకుల్లో ఎప్పుడూ ప్రత్యేక క్రేజ్ ఉంటుంది. ఇప్పటికే ఈ కాంబోలో వచ్చిన అఖండ బ్లాక్‌బస్టర్ హిట్ కావడంతో, ఇప్పుడు వస్తున్న అఖండ 2 – తాండవం పై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. ప్రస్తుతం ఈ భారీ సీక్వెల్‌ షూటింగ్ దాదాపు చివరి దశలో కొనసాగుతోంది. మొదటగా ఈ సినిమాను సెప్టెంబర్‌లో రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు. కానీ తాజా పరిస్థితులు చూస్తుంటే ఆ ప్లాన్ అమలు కావడం కష్టంగా మారింది. తాజాగా వినాయక చవితి సందర్భంగా కనీసం ఒక చిన్న అప్డేట్ వస్తుందని అభిమానులు ఆశించారు. కానీ ఎలాంటి అప్డేట్ రాకపోవడంతో బాలయ్య సినిమా సెప్టెంబర్‌లో వచ్చే అవకాశమే లేదని ఫిక్స్ అయిపోయారు. దీంతో అభిమానుల్లో నిరాశ వాతావరణం నెలకొంది. అయితే మేకర్స్ మౌనం వెనుక ర‌క‌ర‌కాల కార‌ణాలు ఉన్నాయంటున్నారు.


ఇటీవల నందమూరి కుటుంబంలో చోటుచేసుకున్న విషాదం వల్ల కూడా సినిమా పనులు, ప్రమోషన్లు కొంత ఆలస్యం అయినట్టు సమాచారం. దాంతో రిలీజ్ డేట్ విషయంలో మేకర్స్ జాగ్రత్తగా ఆలోచిస్తున్నారని తెలుస్తోంది. తాజాగా వినిపిస్తున్న టాక్ ప్రకారం అఖండ 2 డిసెంబర్ 4వ తేదీ లేదా ఆ వారంలోనే థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఏదేమైనా బోయపాటిబాలయ్య కాంబినేషన్ నుంచి వస్తున్న ఈ అఖండ 2 – తాండవం ఎప్పుడు విడుదలవుతుందనే ఆసక్తి అభిమానుల్లో పెరిగిపోతోంది. అధికారికంగా రిలీజ్ డేట్ ఎప్పుడు ప్రకటిస్తారో చూడాలి.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: