టాలీవుడ్‌లో త్వ‌ర‌లో రిలీజ్‌కు రెడీ అవుతోన్న ‘ఘాటి’ సినిమా చుట్టూ ఇప్పుడు భారీ హైప్ నెలకొంది. క్రిష్‌ దర్శకత్వంలో, అనుష్క ప్రధాన పాత్రలో రూపొందిన ఈ చిత్రం తాజాగా సెన్సార్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది. సెన్సార్ బోర్డు ఈ సినిమాకు U/A సర్టిఫికెట్ మంజూరు చేసింది. సినిమా రన్ టైమ్ మొత్తం 2 గంటల 35 నిమిషాలు గా ఫిక్స్ చేశారు. దీంతో మేకర్స్ ఇక రిలీజ్ డేట్ ప్రకటిండం ఒక్క‌టే మిగిలి ఉంది. సెన్సార్ త‌ర్వాత ఇన్‌సైడ్ టాక్ ప్రకారం ఫస్టాఫ్‌లో ఎమోషనల్ జర్నీని చూపిస్తూ ప్రేక్షకుల హృదయాలను తాకేలా క్రిష్‌ కథను మలిచారట. ప్రత్యేకంగా అనుష్క పాత్ర చాలా బలంగా రాసుకున్నాడ‌ని.. ఆమె పెర్ఫార్మెన్స్ హైలైట్ అవుతుందని సమాచారం. సెకండాఫ్‌కి వచ్చేసరికి పవర్‌ఫుల్ యాక్షన్ సన్నివేశాలతో నిండిపోయి, మాస్‌ ఆడియన్స్‌కి కూడా నచ్చేలా తెరకెక్కించారట. భావోద్వేగాలు, యాక్షన్ మిక్స్ తో సినిమా మొత్తం పక్కా ప్యాకేజీగా ఉందనే టాక్ వినిపిస్తోంది.


క్రిష్‌కు ఇది మళ్లీ బలమైన రీఎంట్రీ అవుతుందన్న అంచనాలు ఉన్నాయి. గత కొన్నేళ్లుగా పెద్ద హిట్ కోసం ఎదురుచూస్తున్న క్రిష్ ఈ సినిమాతో తన స్థాయిని తిరిగి నిరూపించుకోనున్నారని సినీ వర్గాలు భావిస్తున్నాయి. ఇక అనుష్క విషయానికొస్తే, చాలా గ్యాప్‌ తర్వాత సిల్వర్ స్క్రీన్‌పై కనిపించబోతున్నారు. ఆమె కెరీర్‌లో ఇది బెస్ట్ కమ్‌బ్యాక్ అవుతుందన్న మాట ఇండస్ట్రీలో వినిపిస్తోంది. మొత్తం మీద, ఎమోషన్, యాక్షన్ మేళవింపుతో తెరకెక్కిన ‘ఘాటి’ అన్ని వర్గాల ప్రేక్షకులనూ ఆకట్టుకునే అవకాశం ఉందని యూనిట్ నమ్మకంగా చెబుతోంది. ఇప్పుడు అందరి దృష్టి రిలీజ్ డేట్ పైనే ఉంది.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: