
తర్వాత అనిమల్ సినిమాతో ఇండస్ట్రీని షేక్ చేశాడు. ఒక విమానంలో కూడా రొమాన్స్ చేయొచ్చా? చేస్తే అది ఎలా ఉంటుందో కళ్లకు కట్టినట్టు చూపించాడు. రణబీర్ కపూర్, రష్మిక మందన్న ఆ పాత్రలకు కూడా పూర్తి న్యాయం చేశాడు. ఇక ఇప్పుడు అందరి దృష్టి సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్‌లో, ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న స్పిరిట్ సినిమాపైనే ఉంది. ఈ సినిమాలో తృప్తి హీరోయిన్‌గా నటిస్తోంది. అందుకే ఎక్స్‌పెక్టేషన్స్ ఆకాశమే హద్దుగా ఉన్నాయి. ఈ క్రమంలోనే ఒక పెద్ద న్యూస్ బయటకు వచ్చింది. స్పిరిట్ సినిమాలో ఒక ప్రతిష్టాత్మకమైన పాత్ర కోసం సందీప్ రెడ్డి వంగా మెగాస్టార్ చిరంజీవిని అప్రోచ్ అయ్యాడట. ఆల్మోస్ట్ చిరంజీవి కూడా ఓకే చెప్పేసినట్టే సమాచారం. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రానుంది.
ప్రభాస్ కి తండ్రి పాత్రలో చిరంజీవి కనిపించబోతున్నాడనే వార్త ఇప్పుడు వైరల్ అవుతోంది. అంతే కాకుండా, ఈ సినిమాలో చిరంజీవి పాత్ర ప్రభాస్ క్యారెక్టర్ కంటే హైలైట్‌గా నిలిచేలా ఉండబోతోందని టాక్ వినిపిస్తోంది. అసలు చిరంజీవి అంటే సందీప్ రెడ్డి వంగా కి చిన్ననాటి నుండి అభిమానిగా ఉంటూ వచ్చాడు. ఆయనతో సినిమా చేయాలని ఏళ్లుగా వెయిట్ చేస్తున్నాడు. అలాంటి అవకాశం దొరికితే ఆయన మిస్ చేసుకునే ప్రశ్నే లేదు. రియల్ చిరంజీవి ఫ్యాన్ దృష్టిలో ఆయన ఎలా ఉంటారో, ఆయనను ఎలా చూపించాలనుకుంటారో అదే విధంగా ఈ సినిమాలో చూపించబోతున్నాడని చెప్పుకుంటున్నారు. ఇప్పుడు చూడాలి మరి.. ఈ సినిమాతో సందీప్ రెడ్డి వంగా పేరు ఇంకెంత ఎత్తుకు వెళుతుందో..!?