
ఈ సందర్భంగా రుక్మిణి వసంత్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, 'సప్త సాగరాలు దాటి' సినిమా గురించి మాట్లాడకుండా వేరొక సినిమా గురించి మాట్లాడే స్థాయికి తాను ఇంకా చేరుకోలేదని, భవిష్యత్తులో కూడా చేరుకోలేనని భావిస్తున్నానని చెప్పారు. 'సప్త సాగరాలు దాటి' సినిమా తనకు సినీ పరిశ్రమలో రెండో జీవితాన్ని ఇచ్చిందని, తన కెరీర్‌కు మరో అవకాశాన్ని కల్పించిందని ఆమె అన్నారు.
ప్రస్తుతం రుక్మిణి వసంత్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వస్తున్న 'డ్రాగన్' సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో ఆమె పాత్ర ఎలా ఉండబోతుందోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వరుస ప్రాజెక్ట్ లతో రుక్మిణి వసంత్ పారితోషికం కూడా పెరిగిందని తెలుస్తోంది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో రుక్మిణి వసంత్ బాక్సాఫీస్ వద్ద సత్తా చాటనున్నారు.
సరైన ప్రాజెక్ట్ లను ఎంచుకుంటే రుక్మిణి వసంత్ కెరీర్ పరంగా ఎన్నో రికార్డులను క్రియేట్ చేసే ఛాన్స్ అయితే ఉంది. సోషల్ మీడియాలో సైతం ఈ బ్యూటీకి ఊహించని స్థాయిలో క్రేజ్ పెరుగుతోంది. రుక్మిణి వసంత్ లుక్స్ విషయంలో మరింత కేర్ తీసుకుంటే మరిన్ని రికార్డులు క్రియేట్ చేయడం పక్కా అని చెప్పవచ్చు.
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు