సాయి పల్లవి ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్‌లలో ఒకరు. కాంట్రవర్సీల్లో అస్సలు తల దూర్చదు. తన పని తానే చూసుకుంటూ పోతుంది. ఎక్స్పోజింగ్ ఎప్పుడూ చేయదు. కోట్ల ఆఫర్లు వచ్చినా, తనకు ఇష్టం లేకపోతే అస్సలు చూడదు. అలాంటి ఎథిక్స్ ఉన్న హీరోయిన్ . ఇక రష్మిక మందన్నా. ఇండస్ట్రీలో ఆమె “స్టార్ హీరోయిన్” మరియు “మోస్ట్ వాంటెడ్ హీరోయిన్”గా మారిపోయింది. ఆమె చేసిన ప్రతి సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది, అంతే కాకుండా ఆమెకు క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది.


ఇప్పుడు..ఈ ఇద్దరి స్టార్‌ల మధ్య బిగ్ కాంపిటీషన్ ఏర్పడిందని వార్తలు బాగా వైరల్ అయ్యాయి. సాయి పల్లవి “సాఫ్ట్”గా, రష్మిక “హాట్”గా ముద్దుగా పిల్చుకుంటుంటారు అభిమానులు. మరీ ఈ ఇద్దరికి మధ్య ఎలాంటి కాంపిటీషన్ వచ్చిందనేది రకరకాలుగా చర్చిస్తున్నారు జనాలు. ఇప్పుడు టాలెంటేడ్ డైరెక్టర్ సుకుమార్ ప్రాజెక్ట్ కారణంగానే అటు సాయి పల్లవి, ఇటు రష్మిక మందనాల పేర్లు ఇండస్ట్రీలో వైరల్ అవుతున్నాయి. బాలీవుడ్ రామాయణ ప్రాజెక్ట్‌లో బిజీగా ఉన్న సాయి పల్లవికి, సుకుమార్ తన సినిమాలో ఛాన్స్ ఇచ్చినట్లు న్యూస్‌లు వస్తున్నాయి.



అసలు, ఈ రోల్ కోసం ముందుగా రష్మిక మందన్నాను అనుకున్నారట మేకర్స్.  “పుష్ప” సినిమాతో రష్మిక ఎలాంటి క్రేజ్ తెచ్చుకుందో  సుకుమార్ బాగా అర్థం చేసుకున్నాడు. అందుకే కొత్త హీరోయిన్ తీసుకోవడం బదులు, రష్మికను సినిమాలో పెట్టాలని ముందుగా నిర్ణయించారట. కానీ రామ్ చరణ్ మాత్రం దీని కోసం ఓకే చెప్పలేదట. రష్మిక ఇప్పుడు “మోస్ట్ వాంటెడ్ బ్యూటీ”గా మారి, ఆమెతో సినిమా చేస్తే హిట్ అవుతుంది అనేది ప్రజలకు స్పష్టంగా ఉంది. ఒకవేళ్ల అలా జరిగితే ఇక  రామ్ చరణ్ క్రేజ్ ఏమీ ఉండదు. పైగా, మెగా హీరో రామ్ చరణ్ ఎప్పటినుంచో సాయి పల్లవితో సినిమా చేయాలని ఆశపడుతున్నారు.



పలు ఇంటర్వ్యూలలో కూడా ఈ విషయం పరోక్షకంగా బయటపెట్టాడు. అందువల్ల రామ్ చరణ్ - సాయి పల్లవికి ఓటు వేశారట.  కానీ మిగతా మూవీ మేకర్స్ రష్మికకు ఓటు వేశారట. ఇప్పుడు సుకుమార్ ఫైనల్ డెసిషన్‌లో సందిగ్ధంలో ఉన్నారట. రామ్ చరణ్‌తో కలిసి సినిమా చేసే హీరోయిన్గా సాయి పల్లవిని తీసుకోవాలా, రష్మికను తీసుకోవాలా అనే విషయంలో ఆలోచిస్తున్నారు.ఒకవేళ ఇద్దరినీ తీసుకుంటే, నాచురల్‌గా ఉండే క్యారెక్టర్ ఎవరికీ ఇవ్వాలి, రష్మిక క్యారెక్టర్ సినిమా లో ఎలా హైలైట్ చేయాలి అనే విషయాలపై సుకుమార్ తీవ్రంగా ఆలోచిస్తున్నారట. దీని ఫలితంగా, సోషల్ మీడియాలో “సాయి పల్లవి వ్స్ రష్మిక” అనే కొత్త హ్యాష్‌ట్యాగ్ కూడా పాపులర్ అయింది. అభిమానులు సుకుమార్ ఫైనల్ డెసిషన్ కోసం ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: