
ట్రైలర్ విషయానికి వస్తే.. "ఊరికి ఉత్తరాన.. దారికి దక్షిణాన.. పశ్చిమ దిక్కు ప్రేతాత్మలన్ని పేరు వినగానే తూర్పుకి తిరిగి ప్రతిసారి అంటూ డైలాగ్ తో మొదలవుతుంది". ఆ తర్వాత అడవులలో ఒక జాతరతో పాటు హర్రర్ ఎలివేషన్స్ చూపిస్తారు.. ఆ తర్వాత హీరో బెల్లంకొండ శ్రీనివాస్ ఎంట్రీ ఉండక ఆ వెంటనే అనుపమ కూడా కనిపిస్తోంది. ప్రేతాత్మ దాని పరిచయం అనే కాన్సెప్ట్ తో ఒక దెయ్యాల బంగ్లాలోకి తీసుకువెళ్లి వాటి వెనుక ఉన్న కథ ఏంటి ? అంటూ ప్యాలెస్ కి తీసుకువెళ్లి వాటి వెనుక ఉన్న రహస్యాలను బయటకు పెట్టె కథ అన్నట్టుగా కనిపిస్తోంది. ఇక ఇందులో హైపర్ ఆదితో పాటు మరి కొంతమంది కమెడియన్స్ చేసే సన్నివేశాలు కూడా బాగా ఆకట్టుకుంటున్నట్లు కనిపిస్తున్నాయి. అలాగే అనుపమ, బెల్లంకొండ శ్రీనివాస్ మధ్య కెమిస్ట్రీ కూడా బాగా వర్క్ అవుట్ అయినట్లుగా కనిపిస్తోంది. ఇందులో బెల్లంకొండ శ్రీనివాస్ చెప్పే డైలాగ్ చివరిలో అనుపమ దెయ్యంగా మారడం వంటి సన్నివేశాలు హైలెట్ గా ఉన్నాయి.
బెల్లంకొండ శ్రీనివాసు కు సరైన సక్సెస్ లేక సతమతమవుతున్నారు. మరి ఈ సమయంలో కిష్కింధపురి సినిమా ఏ విధంగా సక్సెస్ ని అందుకుంటుందో చూడాలి. ట్రైలర్ లో మాత్రం విజువల్స్ బాగా ఆకట్టుకుంటున్నట్లు కనిపిస్తున్నాయి. మరి సినిమా ఎలా ఉందో తెలియాలి అంటే సెప్టెంబర్ 12వ తేదీ వరకు ఆగాల్సిందే. తెలుగు ప్రేక్షకులు ఈమధ్య హారర్ చిత్రాలకి ప్రాధాన్యత ఇస్తున్నారు.