ప్రస్తుతం ఎక్కడ చూసినా “మిరాయి” సినిమా పేరే మారుమ్రోగిపోతోంది. సోషల్ మీడియాలోనూ, సినిమా ఇండస్ట్రీ వర్గాలలోనూ ఈ సినిమా గురించిన చర్చలు ఊపందుకున్నాయి. ఈ సినిమా కేవలం ఒక మూవీ కాదు, ఈ మధ్యకాలంలో సినీ ప్రేమికులకు ఒక గొప్ప విజువల్ ట్రీట్‌గా నిలిచింది అని చెప్పాలి. ముఖ్యంగా, దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని ఈ చిత్రాన్ని తెరకెక్కించిన విధానం అందరినీ ఆకట్టుకుంటోంది. ఇప్పట్లో సినిమా తెరకెక్కించడం మాత్రమే కాదు, సినిమాని ఎలా ప్రమోట్ చేయాలో కూడా మేకర్స్ బాగా అర్థం చేసుకున్నారు. సినిమా టైటిల్ పెట్టే క్షణం నుంచే పబ్లిసిటీ కోసం స్ట్రాటజీ ప్లాన్ చేస్తారు. టైటిల్ ఆకర్షణీయంగా ఉంటే సినిమాకు పాపులారిటీ మరింత పెరుగుతుందని ఈ జనరేషన్ మేకర్స్ బాగా గ్రహించారు. అందుకే ఈ మధ్యకాలంలో చాలామంది డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ తమ సినిమాలకు వినూత్నమైన టైటిల్స్ పెట్టి ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ క్రియేట్ చేస్తున్నారు.


ఇదే లెక్క “మిరాయి”కి కూడా వర్తించింది. యంగ్ హీరో తేజ సజ్జ హీరోగా, రితికా నాయక్ హీరోయిన్‌గా నటించిన ఈ మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్, సెప్టెంబర్ 12న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యి బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ డూపర్ హిట్ సాధించింది. తొలి రోజునుంచే ఈ సినిమా మీద పాజిటివ్ టాక్ నడుస్తోంది. “మిరాయి” సినిమా కథ, కాన్సెప్ట్, ప్రెజెంటేషన్ అన్నీ చాలా ఫ్రెష్‌గా, డిఫరెంట్‌గా ఉన్నాయని ప్రేక్షకులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.



ఈ విజయానికి టైటిల్ కూడా ఒక ముఖ్యమైన కారణం అని ఇండస్ట్రీ టాక్. “మిరాయి” అనే టైటిల్ సినిమా జానర్‌కి పర్ఫెక్ట్‌గా సూట్ అయిందని, టైటిల్ విన్నప్పుడే సినిమా మీద ఆసక్తి పెరిగిందని ప్రేక్షకులు అంటున్నారు. కానీ నిజానికి ఈ సినిమాకి మొదటగా “వేద” అనే టైటిల్‌ను అనుకోవడం జరిగిందట. సినిమాలో హీరో పాత్ర పేరు ‘వేద’ కావడంతో ఆ టైటిల్‌ను పరిగణలోకి తీసుకున్నారట.  కానీ ఆ టైటిల్ చాలా సింపుల్‌గా ఉందని, ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించలేదని అనిపించింది. అందుకే మేకర్స్ సినిమా కంటెంట్‌కి సరిపోయేలా మరింత యూనిక్ టైటిల్ కోసం శోధించారట.



సుమారు 300 టైటిల్ ఆప్షన్స్‌పై ఆలోచించిన తర్వాత, చివరికి “మిరాయి” అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. “మిరాయి” అనే పదం కొత్తదనాన్ని, థ్రిల్లింగ్ ఫీలింగ్‌ను కలిగించడంతో పాటు సినిమాకి కావాల్సిన గ్రిప్, మిస్టరీని ఇస్తుందని భావించారు. ఆ నిర్ణయం వందకు వంద శాతం సక్సెస్ అయిందని ఇప్పుడు బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్, ప్రేక్షకుల రివ్యూలు చెబుతున్నాయి. దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని విజన్ ఈ సినిమాలో ప్రతీ ఫ్రేమ్‌లో కనిపిస్తోంది. అతను టైటిల్ సెలెక్షన్ నుంచే ఎంత డీటైల్‌గా ఆలోచించాడో ఈ కథ చెబుతోంది. “మిరాయి” అనే టైటిల్ ఈ సినిమాకి సగం సక్సెస్ తెచ్చిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ సినిమా విజయం తేజ సజ్జ కెరీర్‌లో కూడా ఓ మైలురాయిగా నిలవబోతోందని టాక్.న్ఇప్పుడు “మిరాయి” సినిమా కంటెంట్, స్క్రీన్‌ప్లే, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, విజువల్స్ అన్నీ కలిపి థియేటర్స్‌లో ప్రేక్షకులకు మైండ్‌బ్లోయింగ్ అనుభవాన్ని ఇస్తున్నాయి. ఈ సినిమా మరో లెవెల్‌లో సక్సెస్ సాధించడానికి టైటిల్ తీసుకున్న క్రియేటివ్ రిస్క్ కూడా ముఖ్య కారణం అని సినీ విశ్లేషకులు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: